Telangana Elections: కాంగ్రెస్ ఫార్ములా వర్కవుట్ అవుతుందా?
Hyderabad: ఈసారి తెలంగాణ ఎన్నికల్లో (telangana elections) BJP, కాంగ్రెస్, BRS నువ్వా నేనా అన్నట్లు పోటీకి సిద్ధంగా ఉన్నాయి. అందులోనూ TRS కాస్తా BRSగా మారిన తర్వాత జరుగనున్న ఎన్నికలివి. BJPకి ఎటూ స్కోప్ తగ్గిందని కర్ణాటక ఎన్నికలతోనే అర్థమైపోయింది. నార్త్ ఇండియన్ రాష్ట్రాల్లో BJP బలం ఉన్నంత మాత్రాన సౌతిండియాలో పాగా వేయాలని చూసినా వర్కవుట్ కాదన్న సంగతి BJPకి అర్థమైపోయింది. ఇక కాంగ్రెస్ (congress) విషయానికొస్తే కర్ణాటక ఎన్నికల్లో ఎవ్వరి సపోర్ట్ లేకుండా గెలిచేసింది. ఇప్పుడు అదే ఫార్ములాను తెలంగాణలో వాడి గెలిచే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి కాంగ్రెసే కారణమే అయినప్పటికీ వరుసగా ఇక్కడ రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయింది. దానికి కారణం పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేయాలో చెప్పుకోలేకపోవడమే. ఇప్పుడు కాంగ్రెస్ BRSకి పోటీగా వస్తుందేమోనన్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ కూడా ఎక్కడ ప్రసంగించినా కాంగ్రెస్‌నే దూషిస్తున్నారు కానీ BJPని ఏమీ అనడంలేదు.
అదీకాకుండా కాంగ్రెస్ పోటీ చేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన నచ్చని ఓట్లు ఏవైతే ఉంటాయో అవి బీజేపీకి వెళ్లకుండా కాంగ్రెస్‌కే వచ్చేటట్టు ఓట్ల చీలిక ఏర్పడుతుందని పలువురు రాజకీయ నిపుణులు అంటున్నారు. కొన్ని నెలల క్రితం వరకు బీజేపీ ఎక్కడ తెలంగాణ ఎన్నికల్లో గెలిచేస్తుందోనని కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి పోరాడి బీజేపీని తరిమికొట్టాలని అనుకున్నాయి. కానీ కాంగ్రెస్ తామే అధికారంలోకి వస్తామన్న ధీమా వ్యక్తం చేస్తోంది. దాంతో బీఆర్ఎస్‌కు ఇక ఏమాత్రం సపోర్ట్‌కి రావడంలేదు కాంగ్రెస్. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బట్టి తర్వాత జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ కాంగ్రెస్‌లు కలిసిపోయే ఛాన్సులు ఉన్నాయి. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హంగ్ ఏర్పడే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.