BRS BJP: BJPతో కలవనున్న KCR..?
BRS BJP: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి KCRకు బ్యాక్ టు బ్యాక్ దెబ్బలు తగులుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం.. ఆ తర్వాత కాలు జారి కిందపడి తుంటి ఎముక విరగొట్టుకోవడం జరిగాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఎటూ ఓడిపోయాం కనీసం పార్లమెంట్ ఎన్నికల్లో (Lok Sabha Elections) అయినా సత్తా చాటాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ KTR కూడా ఎంపీల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామన్న దిగులు వద్దని.. ఎంపీ ఎన్నికల్లో 100 శాతం గెలుపు తమదే అని ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేసారు. కానీ ఇవేమీ వర్కవుట్ అవ్వడంలేదు. (BRS BJP)
కాంగ్రెస్‌తో టచ్‌లో 26 మంది ఎమ్మెల్యేలు
ఓ పక్క భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్‌లో చేరిపోతున్నారు. ఇప్పటికే 38 మంది ఎమ్మెల్యేలలో 26 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో టచ్‌లో ఉన్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. 2014, 2018 ఎన్నికల తర్వాత కేసీఆర్ కాంగ్రెస్‌కు చుక్కలు చూపించారు. 2018 ఎన్నికల తర్వాత కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల వెంట పడ్డారు. వారికి కాంగ్రెస్‌లో ఉంటే గతి ఉండదని.. తన పార్టీలో చేరితేనే భవిష్యత్తు ఉంటుందని నమ్మించారు. అలా చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు భారత రాష్ట్ర సమితిలో చేరారు. దీని వల్ల కాంగ్రెస్ అభ్యర్ధులు లేక విలవిలలాడిపోయింది. ఇప్పుడు ఇదే ఫార్ములాను కేసీఆర్‌పై రుద్దాలని చూస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)
భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే మల్లా రెడ్డి అల్లుడు, కుమారుడికి సంబంధించిన కాలేజీలు, భవనాలను అక్రమంగా నిర్మించారని నెమ్మదిగా కూల్చివేయించారు. దాంతో మల్లారెడ్డికి గట్టి షాక్ తగిలింది. ఇక భారత రాష్ట్ర సమితిలో ఉంటే తనకు రాజకీయ భవిష్యత్తు ఉండదని భావించిన మల్లారెడ్డి నెమ్మదిగా కాంగ్రెస్‌లోకి జంప్ అవ్వాలని చూస్తున్నారు. కానీ ఇందుకు కాంగ్రెస్ అస్సలు ఒప్పుకోవడంలేదు. అందుకే ఆయన ఇటీవల కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను కలిసి కాంగ్రెస్‌లో చేరే అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది.
ALSO READ: TDP BJP Janasena: జగన్‌ని మోదీ ఎందుకు తిట్టలేదు..?
కవిత అరెస్ట్
ఎంపీ ఎన్నికల నగారా మోగింది. ఈ సమయంలో అసలే ఎంపీలు మెల్లిగా కాంగ్రెస్‌లోకి వెళ్లిపోతుండడంతో భారత రాష్ట్ర సమితి దిక్కుతోచని స్థితిలో ఉంది. ఈ సమయంలో భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను (Kalvakuntla Kavitha) ఢిల్లీ ఈడీ అధికారులు ఢిల్లీ లిక్కర్ స్కాంలో (Delhi Liquor Scam) అరెస్ట్ చేసారు. ఈ నెల 22 వరకు కవిత వారి కస్టడీలోనే ఉండనుంది.
ఇక కేసీఆర్‌కు ఆప్షన్ లేదా?
ఇప్పుడు కేసీఆర్‌కు ఏదన్నా ఆప్షన్ మిగిలి ఉందంటే.. అది భారతీయ జనతా పార్టీ (BRS BJP) సాయం కోరడమే. ఎందుకంటే ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్నది వారే. ఈ లోక్ సభ ఎన్నికల తర్వాత మళ్లీ అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీనే అని సర్వేలు కూడా చెప్తున్నాయి. సో.. ఇప్పుడు కేసీఆర్ పార్టీకి బలం రావాలన్నా.. కవిత ఈడీ బోను నుంచి బయటపడాలన్నా ప్రధాని నరేంద్ర మోదీనే సాయం చేయాలి. ఆయన సాయం చేయాలంటే భారత రాష్ట్ర సమితిని ఎన్డీయేలో భాగంగా చేయాలి. లోక్ సభ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఇదే చేయబోయే అవకాశం ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో మళ్లీ అధికారంలోకి రావాలంటే కేసీఆర్ మరో ఐదేళ్లు ఎదురుచూడాలి. అప్పటివరకు పార్టీలో ఎవరు ఉంటారో కూడా తెలీదు. అసలు పార్టీ ఉంటుందో లేదో కూడా తెలీని పరిస్థితిలో భారత రాష్ట్ర సమితి ఉంది.