Bandi Sanjay: డేంజ‌ర్ జోన్‌లో బండి..!

Hyderabad: క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజ‌య్ (bandi sanjay) డేంజ‌ర్ జోన్‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. BJP తెలంగాణ ప్రెసిడెంట్‌గా బండి సంజ‌య్ మూడేళ్లు పూర్తి చేసుకున్నారు. ఆయ‌న పుణ్య‌మా అని BJP తెలంగాణ‌పై (telangana) కొంత‌వ‌ర‌కు బాగానే ప‌ట్టు సాధించింది. సంజ‌య్ సాయంతోనే దుబ్బాక‌, హుజూరాబాద్ బైపోల్స్‌లో BRSపై బీజేపీ గెలిచింది. ఆ త‌ర్వాత హైదరాబాద్‌లో జ‌రిగిన GHMC ఎన్నిక‌ల్లోనూ BJP 47 సీట్లు సాధించింది. అయితే ఇప్పుడు బండి సంజ‌య్ స్థానాన్ని బీజేపీ భ‌ర్తీ చేసే యోచ‌న‌లో ఉన్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.

అయితే ఇప్పుడు తెలంగాణ బీజేపీ యూనిట్‌లో బండి సంజ‌య్ (bandi sanjay) త‌న ప‌ట్టుని కోల్పోతున్న‌ట్లు అనిపిస్తోంది. ప‌లువురు బీజేపీ నేత‌లు బండి సంజ‌య్‌కు వ్య‌తిరేకంగా మారి తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెంట్ ప‌ద‌వి నుంచి త‌ప్పించాల‌ని హై క‌మాండ్‌ను కోరుతున్నార‌ట‌. బండి సంజయ్ సీనియ‌ర్ల‌తో చ‌ర్చించ‌కుండా తీసుకుంటున్న కొన్ని నిర్ణ‌యాల వ‌ల్ల డిసెంబ‌ర్‌లో తెలంగాణలో జ‌రిగే ఎన్నిక‌ల్లో బీజేపీ గెల‌వ‌డం అనుమాన‌మేన‌ని అంటున్నారు. ఇప్ప‌టికే బండి సంజ‌య్‌కి వ్య‌తిరేకంగా ఉన్న BJP నేత‌లంతా అమిత్ షా (amit shah) , జేపీ న‌డ్డా (jp nadda)ల‌ను క‌ల‌వాల‌ని అనుకుంటున్నార‌ట‌. ఆయ‌న్ను ఎంత త్వ‌ర‌గా తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ ప‌ద‌వి నుంచి త‌ప్పిస్తే అంత మంచిద‌ని చెప్పాల‌నుకుంటున్న‌ట్లు రాజకీయ వ‌ర్గాల టాక్. ఆయ‌న స్థానాన్ని ఈటెల రాజేంద‌ర్‌తో (etela rajender) భ‌ర్తీ చేస్తే బాగుంటుంద‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రి ఈ విష‌యంపై బండి సంజ‌య్, ఈటెల ఏమంటారో వేచి చూడాలి.