ambati rayudu: BRSలోకా జ‌న‌సేనలోకా?

vijayawada: గుంటూరు జిల్లా(guntur district)కు చెందిన తెలుగు క్రికెటర్‌ అంబటి రాయుడి(cricketer ambati rayudu) గురించి తెలియని వారు ఉండరు. అతను ఆటతోపాటే కాకుండా.. మాటలు, వివాదాలతో ఎంతో ఫేమస్‌ అయ్యారు. ప్రస్తుతం తాను రాజకీయాల్లోకి ఎంట్రీ(political entry) ఇవ్వనున్నట్లు చెప్పడం ఆసక్తికరంగా మారింది. మరి అంబటి రాయుడు ఏ పార్టీలో చేరతారు అన్నదానిపై చర్చనడుస్తోంది. ఈ ఐపీఎల్‌ సీజన్‌ ముగిసిన తర్వాత.. రాయుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తాడంట. గుంటూరు జిల్లాకు చెందిన రాయుడు.. ఎన్నికల్లో అరంగ్రేటం గురించి పలు విషయాలు తెలియజేశారు. రాజకీయాల్లోకి రావాలని ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నానని.. ప్రజలకు సేవ చేసేందుకు ఇదే ఉత్తమ మార్గం అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే ఏ పార్టీలో చేరతాన్నది స్పష్టం చేయలేదు. కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడు.. తన సొంత జిల్లా అయిన గుంటూరు నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగే అవకాశం ఉంది.

ఏపీలో బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడు. ఏ పార్టీలో చేరుతారు అన్నదానిపై స్పష్టత లేదు. అయితే ఏపీ బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌(brs thota chandra shekar) ఇప్పటికే రాయుడిని తమ పార్టీలోకి ఆహ్వానించినట్లు సమాచారం. దీనిపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు జనసేన(janasena) పార్టీలో కూడా రాయుడు చేరే అవకాశం లేకపోలేదు. ఇక వైసీపీ(ycp), టీడీపీ(tdp)లో చేరినా.. పోటీ చేసే అవకాశం రాయుడికి ఇవ్వరు. ఎందుకంటే ఇప్పటికే గుంటూరులో ఎక్కడికక్కడ నాయకులు ఆయా స్థానాల్లో ఫిక్స్‌ అయి ఉన్నారు. రాయుడికి అవకాశం ఉన్నదల్లా బీఆర్‌ఎస్‌, లేదా జనసేన ఆప్షన్లు మాత్రమే… ఇక ఈ రెండు పార్టీల్లో చేరి.. ఏ విధంగా రాజకీయాల్లో రాణిస్తారు అన్నది ఇప్పుడే చెప్పలేం.