Allu Arjun: మామ‌గారి త‌ర‌ఫున ప్ర‌చారం?

నాగార్జునసాగర్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (allu arjun) సంద‌డి చేసారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని చింతపల్లిలో అల్లు అర్జున్ మామగారు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి (kancharla chandrasekhar reddy) నిర్మించిన ఫంక్షన్ హాల్‌ను బ‌న్నీ ప్రారంభించారు. అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో (telangana elections) నాగార్జున సాగర్ నుండి BRS టికెట్ కోసం ప్రయత్నిస్తున్నానని, ఒకవేళ ఛాన్స్ వస్తే అర్జున్ (allu arjun) తన కోసం ప్రచారం చేస్తాడని చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.