AP Elections: టార్గెట్ నాదెండ్ల మనోహర్!
AP Elections: ఎన్నికలకు ముందు ఏ పార్టీలైనా గెలవాలనే కృషి చేస్తుంటాయి. కొన్ని పార్టీలు న్యాయంగా పోరాడతాయి. ఇంకొన్ని పార్టీలు ఎంతకైనా తెగిస్తాయి. ఇక్కడ ఎంతకైనా తెగించే పార్టీ ఆంధ్రప్రదేశ్‌లోని అధికార YSRCP పార్టీ. ఈ విషయం పార్టీలో ఉన్నవారికి ఏపీ ప్రజలకు కూడా క్లియర్‌గా తెలుసు. కాకపోతే YSRCP తప్పులు కనిపిస్తాయి ఇంకొన్ని పార్టీలవి కనిపించవు. 2024లో జరగనున్న ఏపీ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ (tdp), జనసేన (janasena) కలిసే బరిలోకి దిగనున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో నిన్న TDP అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) జనసేనాని పవన్ కళ్యాణ్ (pawan kalyan), నాదెండ్ల మనోహర్‌ను (nadendla manohar) కలిసారు. ఎన్ని సీట్లు సర్దుబాటు చేయాలి.. ఎలాంటి ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించాలి అన్న అంశాలపై చర్చించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
సమావేశం అయ్యాక పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడలేదు కానీ నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. ఆ వెంటనే YSRCP మంత్రి అంబటి రాంబాబు (ambati rambabu) ఒక ట్వీట్ చేసారు. నాదెండ్ల మనోహర్ సంతృప్తి చెందేలా సమావేశం జరిగింది. నిజమైన జనసైనికుడు మనోహర్ లేని జనసేనను కావాలని కోరుకుంటాడు అని జనసేన కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా ట్వీట్ చేసారు.
జనసేనలో కోవర్టులు ఉన్నారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే పవన్ కళ్యాణ్ ఓసారి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. జనసేనలో ఉన్నవారు ఎవ్వరైనా నాదెండ్ల మనోహర్‌ను కానీ TDPతో పొత్తును కానీ వ్యతిరేకిస్తే వారంతా జనసేన కోవర్టులతో సమానం అని కరాఖండిగా చెప్పేసారు. కోవర్టులు ఉన్నారు కాబట్టే అసలైన కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా YSRCP ట్వీట్లు, కామెంట్స్ చేస్తోంది. ఎలాగైనా ఎన్నికల లోపు జనసేన TDP పొత్తును విచ్ఛిన్నం చేయడం కానీ.. నాదెండ్లకు పవన్‌కు మధ్య విబేధాలు సృష్టించడం కానీ చేయాలని వారు కుట్రలు పన్నుతున్నట్లు తెలుస్తోంది.