YSRCP: ఎన్నిక‌ల గుర్తుగా ఫ్యానే ఎందుకు?

YSRCP: ఎన్నిక‌ల్లో పోటీ చేసే పార్టీల‌కే కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఒక గుర్తును కేటాయిస్తుంది. వారు కేటాయించిన గుర్తుల నుంచి పార్టీ త‌మ‌కు న‌చ్చిన ఏదో ఒక గుర్తును ఎంచుకోవ‌చ్చు. లేదంటే వారే ఒక గుర్తును ఎంపిక‌చేసుకుని ఎన్నిక‌ల సంఘం నుంచి అనుమ‌తి తీసుకోవ‌చ్చు.

అలా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికారిక YSRCP పార్టీ ఫ్యాన్ గుర్తును ఎంచుకుంది. 2014 అసెంబ్లీ, లోక్ స‌భ ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌మ‌కు ఫ్యాన్ గుర్తును ఇవ్వాల‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘాన్ని కోరింది. ఇందుకు కార‌ణం.. ఫ్యాన్ అనేది పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబాల్లో ఉండే ప‌రిక‌రం అని.. త‌మ పార్టీ ఈ వ‌ర్గాల‌కు చెందిన ప్ర‌జ‌ల కోసం పెట్టిందే అని తెలిపింది. ఇందుకు ఎన్నిక‌ల సంఘం కూడా ఒప్పుకుని ఫ్యాన్ గుర్తును కేటాయించింది.

ఈ ఫ్యాన్ గుర్తును ఎంచుకోవ‌డం వెనుక ఉన్న మ‌రో క‌థ ఏంటంటే.. గ‌తంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఐప్యాక్ ద్వారా ప్ర‌శాంత్ కిశోర్ ఎంతో సాయం చేసారు. ఆ స‌మ‌యంలో ఫ్యాన్ గుర్తు అయితే బాగుంటుంద‌ని ప్ర‌శాంత్ కిశోర్ జ‌గ‌న్‌కు స‌ల‌హా ఇవ్వ‌బ‌ట్టే దీనిని ఎంచుకున్నార‌ట‌.

అందుకే ఆ డైలాగులు

అందుకే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మొన్న జ‌రిగిన సిద్ధం స‌భ‌లో మాట్లాడుతూ.. సైకిల్ బ‌య‌ట ఉండాలి, టీ గ్లాసు సింక్‌లో ఉండాలి.. ఫ్యాన్ ఎప్పుడూ పైన ఉండాలి అంటూ తెలుగు దేశం, జ‌న‌సేన పార్టీల గుర్తుల‌పై కామెంట్స్ చేసారు.