Mouli: సడెన్‌గా YCP కమెడియన్ మౌళిని ఎందుకు టార్గెట్ చేసింది?
Mouli: మరెందుకు రా నీకూ.. అనే డైలాగ్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ ఫేమస్ అయిపోయాడు మౌళి. ఆ తర్వాత ఎన్నో రీల్స్ చేసి నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తున్నాడు. అతనిలో ఉన్న టాలెంట్ చూసి 90’s ఎ మిడిల్ క్లాస్ బయోపిక్ అనే సినిమాలో కీ రోల్లో నటించే అవకాశం కూడా ఇచ్చారు. ఆ తర్వాత మౌళి మరింత ఫేమస్ అయిపోయాడు. అయితే మౌళిని ఇప్పుడు పలువురు YCP నేతలు, కార్యకర్తలు టార్గెట్ చేసి సోషల్ మీడియా వేదికగా వ్యక్తిగత ధూషణలు చేస్తున్నారు. (mouli)
ఇందుకు కారణం మౌళి ఆంధ్రప్రదేశ్ రాజధానిపై రీల్స్, కామెంట్స్ చేయడమే. మౌళి చేసిన రీల్స్‌లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం గురించి చెప్పే ఓ రీల్ ఉంది. అది ఎంత వైరల్ అయిందంటే.. దానిని ఇతర రీల్స్, మీమ్స్‌కి వాడేస్తున్నారు. ఇదే కాకుండా మౌళి ఇటీవల మరో రీల్ చేసాడు. నా చేతిలో ఉన్నదానిని క్షణాల్లో మాయం చేసేస్తాను ఏంటది అంటూ ఓ రీల్ చేసాడు. పైగా దానికి రిప్లై కూడా తానే ఇస్తూ.. నేను చెప్పింది ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి. ఎక్కువగా వెతకకండి. అది మీకు వెతికినా దొరకదు అని పంచ్ వేసాడు. (mouli)
దాంతో మౌళి ఆంధ్రప్రదేశ్‌ని టార్గెట్ చేస్తూ రీల్స్, జోక్స్ వేయడం YCP నేతలకు రుచించలేదు. ఇతన్ని నోటికొచ్చినట్లు కార్యకర్తలు, ఇతర సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా తిట్టిస్తున్నారు. కావాలనే ఏపీని టార్గెట్ చేసి జోకులు వేస్తున్నాడని.. మరోసారి తమ రాష్ట్రం గురించి ఇలాంటివి చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. మౌళి కావాలని ఇలాంటి రీల్స్ చేయడంలేదు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటో ఇప్పటికీ ఎవ్వరికీ తెలీదు. అమరావతి అని చెప్పాలా? వైజాగ్ అని చెప్పాలా? అనే కన్ఫ్యూజన్లో ప్రజలు ఉన్నారు. దీనిని టాపిక్‌గా తీసుకుని ఏదో సరదాగా రీల్స్ చేసాడు మౌళి. అది అర్థం చేసుకోకుండా కామెడీ రీల్స్ చేసుకునే మౌళి లాంటి యంగ్‌స్టర్స్‌ను టార్గెట్ చేయడం ఎంత వరకు సమంజసం అని పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అయితే తనను టార్గెట్ చేయడంపై కమెడియన్ మౌళి ఇప్పటివరకు స్పందించలేదు. అనేవారు అంటూనే ఉంటారు అనుకుని తన కామెడీ తాను చేసుకుంటున్నాడు. (mouli)