AP Elections: పవన్ కళ్యాణ్ నాన్ లోకలా? ఏపీలో పోటీ చేసే హక్కు లేదా?
AP Elections: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు అక్కడ రాజకీయంగా కొత్త చర్చ మొదలైంది. లోకల్, నాన్ లోకల్ అనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తున్నారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (jagan mohan reddy). జనసేనాని పవన్ కళ్యాణ్‌కు (pawan kalyan) తెలంగాణలో ఓటు హక్కు ఉందని.. అలాంటి వ్యక్తి ఏపీలో నాన్ లోకల్ అవుతారని.. నాన్ లోకల్స్ ఎలా ఎన్నికల్లో పోటీ చేస్తారని నేత నందిగం సురేష్ ఆరోపిస్తున్నారు.
తెలంగాణ ఎన్నికల సమయంలో జనసేన BJPతో కలిసి పోటీ చేయడమే కాకుండా ప్రచార సమయంలో తెలంగాణలో పుట్టనందుకు బాధపడుతున్నానని పవన్ అన్నారని.. దానర్థం ఏపీలో పుట్టినందుకు సిగ్గుపడుతున్నట్లు పరోక్షంగా చెప్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇలాంటి వ్యక్తి ఏపీలో పోటీ చేసి ప్రజలను ఓట్లు వేయమని అడిగే హక్కు కూడా లేదని వాపోయారు.
మరోపక్క జనసేన (janasena) నేతలు కూడా ఈ వ్యాఖ్యలకు ధీటుగా స్పందిస్తున్నారు. విదేశాల నుంచి ఎందరో భారతదేశానికి వచ్చి ఇక్కడ పుట్టనందుకు బాధపడుతున్నాను అంటారని ఆ మాత్రం దానికే తమ స్వస్థలాన్ని అవమానించినట్లు కాదని తెలిపారు. ఎన్నికలకు ముందు ప్రజల మైండ్ మార్చడానికే YSRCP లోకల్ నాన్ లోకల్ టాపిక్‌తో రెచ్చగొడుతోందని మండిపడ్డారు.