Jagan మాట‌ల్లో మార్పు.. దేనికి సంకేతం?

Jagan: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి (Jagan Mohan Reddy) మాట‌ల్లో ప్ర‌సంగాల్లో మార్పు వ‌చ్చింది. గ‌తంలో ఆయ‌న ఎన్నో స‌భ‌ల్లో ప్రసంగాలు చేసారు. ప్ర‌తి ప్ర‌సంగంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan) గురించి అత‌ని ముగ్గురు భార్య‌ల గురించి ప్ర‌స్తావించేవారు. న‌లుగురు భార్య‌లు అంటూ హేళ‌న చేసేవారు.

నిజానికి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సొంతంగా ప్ర‌సంగాలు చేయ‌రు. త‌న టీంతో చేయిస్తారు. త‌న టీం ఏం రాస్తారో దానినే చూస్తూ చ‌దివేస్తారు. కానీ నిన్న సిద్ధం స‌భ‌లో మాత్రం ఎక్క‌డా కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు సంబంధించిన నలుగురు భార్య‌ల టాపిక్ రాలేదు. ప‌వ‌న్ గురించి మాట్లాడుతూ.. ఆయ‌నో పొలిటిక‌ల్ క్యాంపెయిన‌ర్ అని మాత్ర‌మే అన్నారు. అలాంటి పొలిటిక‌ల్ క్యాంపెయినర్లు త‌న‌కు లేర‌ని.. త‌న క్యాంపెయినర్లు త‌న నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, ప్ర‌జ‌లే అని అన్నారు.

ALSO READ: ప్ర‌త్యేక హోదా ప‌రిస్థితేంటి? ఎవ‌రు తెస్తారు?

జ‌గ‌న్ ఈసారి ప‌వ‌న్ వ్య‌క్తిగ‌త జీవితాల గురించి ప్ర‌స్తావించ‌క‌పోవ‌డానికి రెండు కార‌ణాలు ఉన్నాయి. ఒక‌టి.. ఇటీవ‌ల ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓ సంద‌ర్భంలో మాట్లాడుతూ.. మాట్లాడితే న‌లుగురు పెళ్లాలు.. న‌లుగురు పెళ్లాలు అంటున్నాడు. నా నాలుగో పెళ్లాం నువ్వే జ‌గ‌న్ అనేసారు. ఇప్పుడు మ‌ళ్లీ జ‌గ‌న్ న‌లుగురు పెళ్లాలు అంటే ఆ పంచ్ మ‌ళ్లీ త‌న‌కే ప‌డుతుంద‌న్న ఉద్దేశంతో దీని గురించి ప్ర‌స్తావించి ఉండ‌క‌పోవ‌చ్చు. (Jagan)

ఇక రెండో కారణం ఏమై ఉంటుందంటే.. ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో పాటు చంద్ర‌బాబు నాయుడు మాత్ర‌మే కాదు.. భార‌తీయ జ‌న‌తా పార్టీ కూడా తోడైంది. ఈ మూడు పార్టీలు క‌లిసి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో బ‌రిలోకి దిగ‌నున్నారు. భార‌తీయ జ‌న‌తా పార్టీ ఇప్పుడు వైసీపీకి ప్ర‌త్య‌ర్ధి పార్టీ లాంటిది. అయిన‌ప్ప‌టికీ జ‌గ‌న్‌కు కేంద్ర ప్ర‌భుత్వంతో మంచి సంబంధాలు ఉన్నాయి. మంత్రి అంబ‌టి రాంబాబు కూడా ఇదే చెప్పారు. ఏవో కార‌ణాల వ‌ల్ల భార‌తీయ జ‌న‌తా పార్టీ ఇత‌ర పార్టీల‌తో పొత్తు పెట్టుకున్నంత మాత్ర‌న త‌మ‌కు క‌మ‌లం పార్టీ మ‌ధ్య విభేదాలు ఉన్న‌ట్లు కాదు అని స్ప‌ష్టం చేసారు.

సో.. ఇప్పుడు జ‌గ‌న్ ప‌వ‌న్‌ను తిడితే.. భార‌తీయ జ‌న‌తా పార్టీని కూడా క‌లిపి తిట్టిన‌ట్లే. కేంద్రంలో అధికారంలో ఉన్న‌.. మ‌ళ్లీ అధికారంలోకి రాబోతున్న‌ భార‌తీయ జ‌న‌తా పార్టీని తిడితే ప‌రిస్థితి ఏంటో జ‌గ‌న్‌కు బాగా తెలుసు. అందుకే ప్ర‌సంగాలు రాయించేవారికి వ్య‌క్తిగ‌త అంశాల గురించి రాయొద్ద‌ని ఆదేశాలు జారీ చేసిన‌ట్లు తెలుస్తోంది.

ALSO READ: BJP: ప్ర‌త్యేక హోదా ఇచ్చి ఒంట‌రిగా పోటీ చేయ‌కూడ‌దా?