EXCLUSIVE: ఇందిరమ్మ ఇళ్ల విషయంలో జాప్యం ఎందుకు?
EXCLUSIVE: తెలంగాణ కాంగ్రెస్ (telangana congress) ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారెంటీల్లో ఇందిరమ్మ ఇళ్ల (indiramma illu) పథకం ఒకటి. ఈ పథకం ఇంకా అమలు కాలేదు. అమలు చేయాలన్నా ఎన్నో సందేహాలు ఉన్నాయి. అసలు ఇస్తారా లేదా అనేది కూడా క్లారిటీ లేదు. ఇందిరమ్మ ఇళ్ల పథకం డిజైన్‌పై స్పష్టత రాకపోవడంతో లబ్దిదారుల్లో ఆందోళన నెలకొంది.
BRS హయాంలో సొంత స్థలం ఉన్నవారికి గృహలక్ష్మి పథకం కింద రూ.3 లక్షల వరకు సాయం అందించారు. ఇప్పుడు ఆ గృహలక్ష్మి పథకాన్ని తొలగించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సొంత స్థలం ఉన్నవారికి ఆ రూ.3 లక్షలు కాస్తా రూ.5 లక్షలు చేస్తామని ప్రకటించింది. పేదల ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షల లోపే ఖర్చు అవుతుందని అంచనా. రూ.5 లక్షలతో ఇళ్లు కట్టాలంటే 70 గజాల స్థలం కావాలని అధికారులు మంత్రిత్వ శాఖకు సూచించారు.
తెలంగాణలో 60 గజాల కంటే తక్కువగా సొంత జాగా ఉన్నవారి సంఖ్యే ఎక్కువగా ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. విస్తీర్ణంతో సంబంధం లేకుండా అందరికీ రూ.5 లక్షలు మంజూరు చేస్తే అవినీతి చర్యలకు పాల్పడే అవకాశం ఉందని కూడా ఆరోపిస్తున్నారు. దాంతో ఇందిరమ్మ ఇళ్లపై ఇప్పుడప్పుడే క్లారిటీ వచ్చేలా లేదు.