Mudragada: ప‌వ‌న్ క‌ళ్యాణ్ పిలిస్తే నేనెందుకు వెళ్లాలి?

Mudragada: కాపు సంఘం అధినేత ముద్ర‌గ‌డ ప‌ద్మనాభం స్వ‌రం మార్చారు. గ‌తంలో జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan) పిలిస్తే త‌ప్పకుండా అండ‌గా ఉంటాను అన్న ఈయ‌న‌.. ఇప్పుడు అసలు ప‌వ‌న్‌కి ఏం అర్హ‌త ఉంద‌ని నేను వెళ్ల‌డానికి అని మాట మార్చారు. కాపులకి రాజ్యాధికారం కావాలి, ఇన్నాళ్లు రాజ్యాధికారం దక్కలేదని అన్నారు.

“”  జగన్ మోహ‌న్ రెడ్డి.. వైఎస్సార్ కొడుకు మాత్ర‌మే కాదు ఆయన ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రి. అలాంట‌ప్పుడు ఆయన పిలిస్తే వెళతాను. పవన్ కళ్యాణ్ ఏం చేశాడు? ఎంపీనా, ఎమ్మెల్యేనా? అలాంట‌ప్పుడు నేనెందుకు వెళ్లాలి? పెద్ద కుటుంబాల వాళ్లు పిలిస్తే వెళతాను. అసలు ప‌వ‌న్ చేసే పనులకు, చెప్పే నీతులకి ఏమైనా పొంతన ఉందా? రాజ్యాధికారం లేని వర్గానికి ఊతమివ్వాలి కానీ, లేదు కాబట్టి ఉన్నవాళ్లకి ఊడిగం చేస్తాననడం ఏమిటి? అసలు నిలకడ అంటూ లేని ఈ వ్యక్తికి విశ్వసనీయత ఎక్కడుంది? “” అని మ‌రోసారి ప‌వ‌న్‌ను టార్గెట్ చేసారు.