Janasena: CBN + PK – PK..!
Janasena: జనసేనాని పవన్ కళ్యాణ్ (pawan kalyan) ఎప్పుడైతే BJPతో చర్చించకుండా ఆ పార్టీని వదులుకుని తెలుగు దేశం పార్టీతో (TDP) పొత్తు పెట్టుకున్నారో అప్పుడే ఆయన చంద్రబాబు నాయుడు (chandrababu naidu) పద్మవ్యూహంలో చిక్కుకుపోయారు. ఈ విషయం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న సంఘటనలను చూస్తే సాధారణ ప్రజలకు కూడా క్లియర్‌గా తెలిసిపోతుంది.
ఇటీవల పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ చంద్రబాబు నాయుడుని కలవడం పెద్ద చర్చకు దారి తీసింది. 2019లో జగన్ మోహన్ రెడ్డిని (jagan mohan reddy) గెలిపించేందుకు ఎంతో కృషి చేసిన ప్రశాంత్ 2024 ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీకి సాయం చేయబోతున్నట్లు సంకేతాలు క్లియర్‌గానే ఉన్నాయి. తెలుగు దేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలని పవన్ నిర్ణయించుకున్నారు సరే.. కానీ చంద్రబాబు, లోకేష్ మాత్రం పవన్‌ను పక్కకు పెట్టేస్తున్నారు.
నారా లోకేష్ ఇటీవల చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే ఆ పార్టీ నుంచే ముఖ్యమంత్రి అభ్యర్ధి ఉంటారు అని కనీసం మాటవరసకు కూడా అనని లోకేష్.. ఎవరికి ఎన్ని సీట్లు వచ్చినా సీఎం మాత్రం చంద్రబాబే అని ప్రకటించేస్తున్నారు. పైకి మాత్రం పవన్ అన్న అండగా ఉన్నారు అని చెప్తున్నారు. ఇప్పుడు ప్రశాంత్ కిశోర్‌ను కలిసారు కాబట్టి ఇక పవన్ అవసరం లేదనుకున్నారో ఏమో.. అసలు ప్రశాంత్ కిశోర్ వచ్చినప్పుడు పవన్‌ను కూడా పిలుద్దాం అన్న విషయాన్నే మర్చిపోయారు. దీని గురించి అడిగితే పవన్ వేరే పనులలో బిజీగా ఉన్నారు అంటారు. ఆయనకు ప్రస్తుతం రాజకీయాలు ప్రచారాలు ఏపీలో మంచి పాలన తీసుకురావడమే పని.
అలాంటి వ్యక్తి ప్రశాంత్ కిశోర్ వచ్చినప్పుడు పిలిస్తే రాకుండా ఉంటారా అనే చర్చ కూడా మొదలైంది. ఒక్క మాటలో చెప్పాలంటే పవన్‌కు జనసేన గెలవకపోయినా ఫర్వాలేదు జగన్ మాత్రం గెలవకూడదు అని మాత్రమే ఉంది. అందుకే చంద్రబాబు ఏం చెప్తే అది విని తగ్గుతున్నారని తెలుస్తోంది. ఇలా అయితే చంద్రబాబు గెలిచాక పవన్‌ను పక్కన పెట్టడని ఏంటి గ్యారెంటీ? ఈ విషయాన్ని పవన్ నాదెండ్ల మనోహర్‌తో కూడా చర్చించలేకపోతున్నారా? లేదా మీరూ మీరూ ఎవరినైనా కలుసుకోండి.. ఏపీలో మాత్రం జగన్‌ను ఓడించండి అని పవన్ చంద్రబాబుకు చెప్పి పక్కకు తప్పుకున్నారా? ఇవన్నీ పవన్‌కే తెలియాలి మరి..!