Janasena c/o TDP: ప‌వ‌న్.. ఇది స‌బ‌బేనా?

Janasena c/o TDP: పదేళ్లుగా నమ్ముకున్న వారికి మొండి చెయ్యిస్తూ.. కొన్ని రోజుల క్రితం పార్టీలో చేరిన వారికే టికెట్లు ఇస్తున్న జనసేన పార్టీని భవిష్యత్తులో ఇతర నాయకలు నమ్ముతారా? జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నీ విష‌యాలు ఆలోచించుకునే ఇలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటున్నారా? 2024 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలిచేస్తే త‌ర్వాత సంగ‌తి త‌ర్వాత చూసుకుందాం అనే ఆలోచ‌నా ధోర‌ణిలో ప‌వ‌న్ ఉన్న‌ట్లు తెలుస్తోంది.

జనసేన టికెట్‌పై పోటీ చేస్తున్నవారిలో అధిక శాతం తెలుగు దేశం పార్టీ వారే అవ్వడంతో, ఒకవేళ వాళ్లు గెలిచినా జనసేనలో ఉండరనే విషయం తెలిసినా వాళ్లకి టికెట్లు ఇవ్వడంలో ప‌వ‌న్ అంత‌రార్థం ఏంటో ఆయ‌న‌కే తెలియాలి. ఇవన్నీ పవన్ జనసేన అనే పార్టీ తెలుగు దేశం పార్టీ కోసమే పెట్టారని వైఎస్సార్ కాంగ్రెస్ కొన్నేళ్లుగా చేస్తున్న ప్రచారానికి ఊతమిస్తున్నట్టే కదా..! దీని వల్ల జనసేన పార్టీ భవిష్యత్తే ప్రశ్నార్థకం అవ్వబోతుంది అని ఆ పార్టీని వదిలి వెళ్లిపోతున్న నాయకులు అంటున్నారు.