Nara Lokesh కు Z సెక్యూరిటీ.. పవన్‌కు ఎందుకు ఇవ్వలేదు?
Nara Lokesh: తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు కేంద్ర ప్రభుత్వం Z కేటగిరి కేటాయించింది. Z కేటగిరీ అంటే CRPF లేదా ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) వారు భద్రతను ఇస్తారు. Z కేటగిరీలో 22 మంది భద్రతా సిబ్బంది ఉంటారు. ఈ కేటగిరీలో భద్రత కల్పిస్తే ఫలానా నాయకుడి చూట్టూ దాదాపు ఏడుగురు సిబ్బంది ఉంటారు. మిగతా వారు వెనక ముందు ఎస్కార్ట్ చేస్తుంటారు. ఈ Z కేటగిరీని కేంద్ర ప్రభుత్వం నారా లోకేష్‌కు కేటాయించడంపై జనసేన కార్యకర్తలు, జనసైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇందుకు కారణం ఏంటంటే.. చాలా రోజుల నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్‌కు (Pawan Kalyan) బయటి నుంచి ప్రాణాలకు ముప్పు ఉందని.. ఆయనపై చాలా మంది కన్నేసారని అందుకోసం Z కేటగిరీ భద్రతను కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఆయనకు ఇప్పటివరకు కల్పించకపోగా Y కేటగిరీ కల్పించారు. కానీ నారా లోకేష్‌కు మాత్రం రిక్వెస్ట్ పెట్టుకున్న వారంలోనే Z కేటగిరీని కల్పించారు.
Y కేటగిరీ అంటే ఏంటి?
Y కేటగిరీలో 11 మంది సిబ్బంది మాత్రమే ఉంటారు. వారిలో ఇద్దరు కమాండోలు, పోలీసులు, పర్సనల్ సెక్యూరిటీ గార్డులు ఉంటారు. ఎవరైతే ఇతరుల నుంచి బెదిరింపులు ఎదుర్కొంటారో వారికి ఈ Y సెక్యూరిటీని కేంద్రం కల్పిస్తుంది. ఇక Z సెక్యూరిటీ ఖరీదు విషయానికొస్తే.. ఈ సెక్యూరిటీకి కేంద్రం నెలకు 15 నుంచి 20 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అదే Y సెక్యూరిటీకి అయితే.. 12 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.
నారా లోకేష్‌కు Z కల్పించి పవన్‌కుఎందుకు కల్పించలేదు అని జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ నాయకుడికి కూడా Z కేటగిరీ భద్రతను కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.