Pawan Kalyan చంద్ర‌బాబు కేంద్రాన్ని ప్రశ్నించలేరా? BJP అంటే అంత భక్తా?

Hyderabad: ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానన్న కాంగ్రెస్‌, BJP పార్టీలు ఇప్పుడు మౌనం వహించాయి. ఈ నేపథ్యంలో ఏపీలోని YCPపై, కేంద్రంలో BJPపై ప్రతిపక్ష పార్టీలు అయిన TDP, జనసేన ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. కానీ ఏపీలో అది జరగడం లేదు. టీడీపీ, జనసేన (pawan kalyan) ఆ పనిలో చాలా వెనుకబడ్డాయి. దీనికి కారణం.. బీజేపీతో పొత్తుపెట్టుకోవాలని టీడీపీ, జనసేన పార్టీలు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. కానీ బీజేపీ మాత్రం పొత్తు గురించి ఏమీ మాట్లాడట్లేదు. పైగా ఇటీవల లోట్‌ బడ్డెట్‌ కింద పదివేల కోట్లను కేంద్రం విడుదల చేయడంతో.. వైసీపీకి బీజేపీ మద్దతు ఇస్తుందా అన్న సంకేతం ప్రజల్లోకి వెళ్తోంది.

2014 ఎన్నికల్లో bjp, tdp, జనసేన (janasena) పార్టీలు పొత్తుతో వెళ్లి విజయం సాధించాయి. ఆ తర్వాత టీడీపీ… బీజేపీ, జనసేనను పట్టించుకోలేదు. కనీసం ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌ షాలు అప్పట్లో ఏపీకి వచ్చిన సమయంలో టీడీపీ అగౌరవపరిచిందని వార్తలు వచ్చాయి. దీంతో బీజేపీ టీడీపీ మధ్య కొన్నిళ్లు వార్‌ నడిచింది. ఇక 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమి పాలైంది. సీఎం జగన్‌ 151 స్థానాల్లో గెలుపొందారు. దీంతో జగన్‌కు ఎన్నికల ముందు నుంచి బీజేపీ సపోర్టు చేస్తూ వచ్చిందని వార్తలు వచ్చాయి. ఇక రానున్న ఎన్నికల్లో బీజేపీ మద్దతు కోసం మరోసారి జనసేన, టీడీపీ ప్రయత్నిస్తున్నాయి. కానీ బీజేపీ మాత్రం టీడీపీతో కలిసేందుకు ఇష్టపడటం లేదు. ఇది బహిరంగంగా అందరికీ తెలిసినా.. టీడీపీ జనసేన… కేంద్రంపై ఏపీ సమస్యల గురించి కూడా పోరాటం సాగించట్లేదు.