Pushpa సినిమాపై పార్లమెంట్‌లో చర్చ ఎందుకు జరిగింది?
Pushpa: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (allu arjun) నటించిన పుష్ప, పుష్ప 2 సినిమాల గురించి పార్లమెంట్‌లోని రాజ్య సభలో (rajya sabha) చర్చ జరిగింది. ఎంపీ రంజీత్ రంజన్ (ranjeet ranjan) ఈ సినిమా గురించి తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ అసలు ఇలాంటి చెత్త సినిమాలు ఎందుకు తీస్తున్నారు.. తీసినా సెన్సార్ బోర్డు ఎందుకు అంగీకరిస్తోంది అని సూటి ప్రశ్న వేసారు.
ఈ ఒక్క సినిమా గురించే కాదు రణ్‌బీర్ కపూర్ (ranbir kapoor), సందీప్ రెడ్డి వంగాల (sandeep reddy vanga) కాంబినేషన్‌లో వచ్చిన యానిమల్ (animal) సినిమా గురించి కూడా ప్రస్తావించారు. తన కుమార్తె ఫ్రెండ్స్‌తో కలిసి యానిమల్ సినిమాకు వెళ్లిందని.. సినిమా మధ్యలోనే ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చిందని ఎంపీ అన్నారు. ఆడవాళ్లను ఇంత తప్పుగా చూపిస్తున్న సినిమాలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారు అని ప్రశ్నించారు. అర్జున్ రెడ్డితో (arjun reddy) మొదలైన ఇలాంటి చెత్త సినిమాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని.. సెన్సార్ బోర్డు వీటిని ఎలా అనుమతిస్తోందో తనకు అర్థంకావడంలేదని మండిపడ్డారు. యానిమల్, పుష్ప వంటి సినిమాలు సమాజాన్నే భ్రష్ఠు పట్టిస్తున్నాయని మండిపడ్డారు.