BRS నేతలను టెంప్ట్ చేస్తున్న కాంగ్రెస్ హామీలు..?
BRS మేనిఫెస్టో ప్రకటించగానే ఎందరో నేతలు కాంగ్రెస్‌లోకి (congress) జంప్ అయిపోతున్నారు. ఇందుకు కారణం కాంగ్రెస్ ప్రకటించిన 6 హామీల సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది అనే భావన నేతల్లో కలుగుతోందట. ఈ విషయాన్ని DCC అధ్యక్షుడు, కాంగ్రెస్ నేత రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ తెలిపారు. భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని.. BRS కంటే ముందే కాంగ్రెస్ ఇచ్చిన 6 హామీలపైనే ప్రజలు ఆశలు పెట్టుకున్నారని అన్నారు. భారత రాష్ట్ర సమితి మేనిఫెస్టోతో పోలిస్తే కాంగ్రెస్ మేనిఫెస్టో చాలా బాగుందని అంటున్నారు.
భారత రాష్ట్ర సమితి మేనిఫెస్టోపై నమ్మకం లేకే చాలా మంది నేతలు కాంగ్రెస్‌లో చేరుతున్నారని తెలిపారు. జగిత్యాల జిల్లాలోని ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భారత రాష్ట్ర సమితి యూత్ వింగ్‌కి చెందిన దాదాపు 250 మంది నేతలు ఈరోజు కాంగ్రెస్‌లో చేరారు. ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్ ఇన్ఛార్జ్ లక్ష్మణ్ దాదాపు రూ. 2 కోట్లు ఖర్చు పెట్టి తన కోసం క్యాంప్ ఆఫీస్‌ని నిర్మించుకున్నారని ఆరోపించారు. కానీ ఇదే నియోజకవర్గంలో డబుల్ బెడ్రూం ఇళ్లను మాత్రం ఇప్పటివరకు నిర్మించలేదని మండిపడ్డారు.