KTR: ఎన్నికల గురించి పవన్‌లాగే మాట్లాడుతున్నారా?
Hyderabad: త్వరలో ఏపీ, తెలంగాణలో ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. అధికార పార్టీలు, ప్రతిపక్ష విపక్ష పార్టీలు ఇప్పుడే ప్రచారాలు మొదలుపెట్టేసాయి. ఓ పక్క ఏపీలో జనసేనాని పవన్ కళ్యాణ్ (pawan kalyan) వారాహి (varahi) యాత్ర నిర్వహిస్తున్నారు. మరోపక్క TDP నేత నారా లోకేష్ (nara lokesh) యువగళం పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఇక తెలంగాణలో ఎప్పటికప్పుడు తాము అధికారంలోకి వచ్చాక ఏమేం చేసామో సోషల్ మీడియా ద్వారా బాగానే ప్రచారం చేసుకుంటోంది BRS. ఈ నేపథ్యంలో ఒక ఇంట్రెస్టింగ్ చర్చ మొదలైంది రాజకీయ వర్గాల్లో. అదేంటంటే.. పవన్ కళ్యాణ్ ప్రచారాల్లో ఎలా మాట్లాడుతున్నారో.. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి KTR అలాగే మాట్లాడుతున్నారట. ఒక్క ఛాన్స్ ఇవ్వండి తామేంటో నిరూపిస్తామని పవన్ అంటున్నారు. తాను సీఎం కావాలని ప్రజలంతా కోరుకోవాలని కూడా అంటున్నారు.
ఓపక్క YCPని ఓడించడానికి ఇతర పార్టీలు కూడా TDP, BJPతో చేతులు కలపాలని పవన్ అంటూనే.. మరోపక్క తాను ఏ పార్టీ కోసమూ పనిచేయడంలేదని, ఆత్మాభిమానాన్ని చంపుకోనని అంటున్నారు. ఇదే విధంగా KTR కూడా వ్యాఖ్యానించారు. ఇటీవల అపోజిషన్ పార్టీ మీట్ ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. BJPని ఓడించడానికి కాంగ్రెస్ ఏర్పాటుచేసిన సమావేశం ఇది. దీనికి అన్ని రాష్ట్రాలకు చెందిన బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఏకమయ్యాయి కానీ బీఆర్ఎస్ మాత్రం వెళ్లలేదు. దీనిపై KTR స్పందిస్తూ.. మోదీకి దేశంలో ఉన్న పవర్ వేరని, ఇలా అపోజిషన్ మీట్లతో ఆయన్ను ఎదుర్కోవడం కష్టమని అన్నారు. ఇప్పుడిప్పుడే నేషనల్ పాలిటిక్స్‌లోకి ఎంటర్ అయిన తమ పార్టీ మెల్లిగా నిలదొక్కుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి గెలవాలనుకుంటున్నామని పేర్కొన్నారు. ఒక ప్రభుత్వాన్ని కూల్చి తమ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే ఆలోచన లేదని, నెమ్మదిగానే ఎన్నికలకు వెళ్తామని అన్నారు. కేటీఆర్ మాటలు కాస్త పవన్ కళ్యాణ్ ఆలోచనా విధానాన్ని గుర్తు చేస్తున్నాయని పలువురు రాజకీయ నిపుణులు అంటున్నారు.