Janasena: వైసీపీ నుంచి వ‌చ్చిన అత‌నికి ప‌వ‌న్ ఎందుకు సీటు ఇవ్వ‌లేదు?

Janasena: జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan) ఇప్ప‌టికే 6 స్థానాల‌కు అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టించారు. మ‌రో ప‌ది మంది అభ్య‌ర్ధుల‌ను ఈరోజు ప్ర‌క‌టించ‌నున్నారు. అయితే ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారిన అంశం ఏంటంటే.. కొన్ని నెల‌ల క్రితం YSRCP నుంచి వ‌చ్చిన బీసీ నేత వంశీ కృష్ణ‌ శ్రీనివాస్ యాద‌వ్.. (Vamsi Krishna Srinivas Yadav) జ‌నసేన‌లోకి వ‌చ్చినప్పుడు ఆయ‌న‌కు సీటు ఎందుకు ఇవ్వ‌లేదు అని.

వైసీపీలో ఉన్న‌ప్పుడు శ్రీనివాస్ యాదవ్ విశాఖ తూర్పు నుంచి పోటీ చేసి తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) అభ్య‌ర్ధి వెల‌గ‌పూడి రామ‌కృష్ణాబాబు చేతిలో ఓడిపోయారు. ఆ త‌ర్వాత ఆయ‌న విశాఖ తూర్పు వైపీపీ అధ్య‌క్షుడిగా.. ఎంపీ విజ‌య‌సాయి రెడ్డికి మంచి స‌న్నిహితుడిగా ఉన్నారు. కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆయ‌న 2023లో వైసీపీని వీడి జ‌న‌సేన పార్టీలో చేరారు.

ALSO READ: పౌరస‌త్వ‌ సవ‌ర‌ణ చట్టాన్ని వ్య‌తిరేకించిన వైసీపీ

అయితే శ్రీనివాస్ యాద‌వ్ పార్టీలో చేరిన‌ప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఒక మాట‌న్నారు. మ‌న శ్రీనివాస్ యాద‌వ్ కేబినెట్‌లో మంత్రిగా ఉంటే ఎంత బాగుంటుంది.. ఆయ‌న కూడా బ్లూ లైటు కారులో వెళ్తుంటే మ‌న నేత అలా కారులో వెళ్తున్నాడు అని గొప్ప‌గా చెప్పుకుంటాం కదా అని చ‌మత్క‌రించారు. అయితే.. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే ఆంధ్ర‌ప్రదేశ్ ఎన్నిక‌ల్లో (AP Elections) మాత్రం శ్రీనివాస్ యాద‌వ్‌కు సీటు ఇవ్వ‌లేదు. శ్రీనివాస్ యాద‌వ్ విష‌యంలో ప‌వ‌న్ కేవ‌లం పొగ‌డ్త‌ల‌కే ప‌రిమితం అయ్యారంటూ YSRCP మంత్రి అంబ‌టి రాంబాబు (Ambati Rambabu) చిచ్చుపెట్టారు. శ్రీనివాస్ యాద‌వ్‌కేమో కేవ‌లం పొగ‌డ్త‌లు.. సీటు మాత్రం నాదెండ్ల మ‌నోహ‌ర్‌కి.. ఇదేం రాజ‌కీయం అంటూ ఆయ‌న ట్వీట్ చేసారు.