AP Elections: జ‌గ‌న్ మామ‌య్యా.. అన్న‌య్యా అని పిలిపించుకోలేవా?

AP Elections: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న స‌మ‌యంలో కీల‌క ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వైఎస్ షర్మిళ (ys sharmila) నారా లోకేష్‌కు (nara lokesh) క్రిస్మ‌స్ కానుక ఇచ్చి మ‌ద్ద‌తు తెల‌ప‌డం.. ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలి బాధ్య‌త‌లు చేప‌ట్టాల‌న్న స‌న్నాహాలు చేయ‌డం.. ఏపీ ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌నుకోవ‌డ‌మే కాకుండా క‌డ‌ప నియోజ‌క‌వర్గం నుంచి పోటీ చేయాల‌నుకోవ‌డం.. అబ్బో రాబోయే రోజుల్లో మ‌రింత ర‌సవ‌త్త‌రంగా ఏపీ రాజ‌కీయాలు మార‌నున్నాయి.

2019 ఎన్నిక‌ల్లో ష‌ర్మిళ‌ను త‌ల్లి విజ‌య‌మ్మ‌ను బాగా వాడుకున్న జ‌గన్ సీఎం అవ్వ‌గానే ప‌క్క‌కు పెట్టేసారు. దాంతో ఏపీలో త‌న‌కు ద‌క్కాల్సిన గౌర‌వం ద‌క్క‌క‌పోవ‌డంతో తెలంగాణ‌లో పార్టీ పెట్టారు ష‌ర్మిళ‌. KCRను కుర్చీ దించాల‌ని దృఢ సంక‌ల్పంతో ఉన్న ఆమె చివ‌రికి కాంగ్రెస్‌తో చేతులు క‌లిపి పోటీ నుంచి త‌ప్పుకుని మ‌రీ వారికి మ‌ద్ద‌తు ఇచ్చింది. ఇప్పుడు తెలుగు దేశం పార్టీకి స‌పోర్ట్ ఇస్తూ మెల్లిగా ఏపీ రాజ‌కీయాల్లోకి అడుగుపెట్టేసింది. ష‌ర్మిళ కార‌ణంగా జ‌గ‌న్ ఓటు బ్యాంక్‌కు చిల్లుప‌డ‌నుంది. టికెట్ రాదేమోన‌న్న అనుమానంతో కొంద‌రు YSRCP నేత‌లు ప‌క్క చూపులు చూస్తున్నారు. ఇప్ప‌టికే మంగ‌ళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి ష‌ర్మిళ వెంట న‌డుస్తాన‌ని ప్ర‌కటించేసారు.

ఇంత జ‌రుగుతున్నా జ‌గ‌న్ త‌న చెల్లెలిని పిలిచి రాజీకి వ‌స్తార‌నుకుంటే అలాంటిది ఏమీ క‌నిపించ‌డంలేదు. కుటుంబంలో నుంచి ఒక వ్య‌క్తి రాజ‌కీయాల్లో ఎదుగుతున్నాడంటే.. ఆ కుటుంబంలోని మిగ‌తా వారు కూడా ఆ వ్య‌క్తికి స‌పోర్ట్ చేస్తారు. జ‌గన్ విష‌యంలో ష‌ర్మిళ‌, విజ‌య‌మ్మ ఎంత‌గా మ‌ద్ద‌తు ఇచ్చారో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఇప్పుడు ఆ చెల్లే వెనుదిరిగిన బాణ‌మై దూసుకొస్తోంది. ఏపీ ప్ర‌జ‌ల చేత అన్న‌య్య‌, మావ‌య్య అని పిలిపించుకుంటున్న జ‌గ‌న్‌కు ఎందుకు సొంత చెల్లి నుంచి అన్న‌య్య అనే పిలుపుకు దూరంగా ఉంటున్నారో ఆయ‌న‌కే తెలియాలి.