Pilli Manikyala Rao: జ‌గ‌న్‌వి ఆడంగి మాట‌లు

Pilli Manikyala Rao: జగన్ మగాడు అంటున్న YSRCP నాయకులు ‘సిద్ధం’ సభలో జగన్ ఆడంగి మాటలకు అర్థం చెప్పగలరా? పవన్ కల్యాణ్ భార్యల గురించి మాట్లాడటమంటే ఆడంగి మాటలు కాదా అని మండిప‌డ్డారు TDP రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు.
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పిల్లి మాణిక్యరావు మాట్లాడిన మాటలు క్లుప్తంగా మీ కోసం. (Pilli Manikyala Rao)

“””” TDP-జనసేన ఉమ్మడి ‘జెండా’ సభ విజయవంతంతో జగన్ చెంచాలు చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నాయి. పేర్ని నానితోపాటు ఐదుగురు మంత్రులు ప్రెస్ మీట్ లు పెట్టారంటే వారికి ఒంట్లో వణుకు పుట్టినట్లు కాదా? వందల సంఖ్యలో సంక్షేమ పథకాలు రద్దు చేసిన జగన్ లాంటి వ్యక్తికి ఓట్లేస్తారా? బీసీ మంత్రి, దళిత ఎంపీ అవాకులు చవాకులు పేలుతున్నారు. అసలు దళిత ఓట్లు వైసీపీకి పడతాయనే నమ్మకం ఎవరికైనా ఉందా? ఎన్నికల స్టంట్ లో భాగంగా గంగలో మునిగి జంజం వేసుకున్నావు. కుటుంబ సమేతంగానేమో ఏసయ్యను ప్రార్థిస్తావు. దేవుడిపై రాజకీయాలు చేయడం మానాలి. కల్తీ మద్యం తాగించి జనాల ఆరోగ్యాల్ని పాడు చేసింది చాలదా? తాడేపల్లిగూడెంలో జరిగిన TDP-జనసేన “తెలుగు జన విజయకేతనం సభకు” ప్రజలు బ్రహ్మరథం పట్టారు. లక్షలాది ప్రజలు తరలిరావడంతో వైకాపా నేతల ప్యాంట్లు తడుస్తున్నాయి. నిన్నటి సభతో TDP-జనసేన పొత్తు సూపర్ హిట్ కావడంతో భయపడిన వైకాపా నేతలు.. పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు.

నిన్న తాడేపల్లిగూడెంలో ‘తెలుగు జన’ విజయకేతనం జెండా సభ ఒక చరిత్ర. రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం రెండు పార్టీలు ఉమ్మడిగా నిర్వహించిన సభను చూసి వైకాపా నేతలు బెంబేలెత్తుతున్నారు. మొదటి ఎన్నికల ప్రచార సభతోనే వైకాపాకు దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయింది. ఇక ముందు ముందు చుక్కలే. నిన్నటి సభ ఏపీ దిశా, దశా మార్చబోయే సభ. అహంకారంతో రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన జగన్ ను గద్దె దింపడానికి శ్రీకారం చుట్టిన సభ. ధ్వంసమైన రాష్ట్రాన్ని నిలబెట్టడానికి టీడీపీ-జనసేన చేతులు కలిపాయి. హత్యకు గురైన రాష్ట్రాన్ని తిరిగి బతికించడానికి కలిసి ముందుకు వచ్చాం. దెబ్బతిన్న రైతుల కోసం, యువత ఉద్యోగాల కోసం, చిధ్రమవుతున్న పేదవారిని కాపాడేందుకు టీడీపీ-జనసేన కలిసి కదం తొక్కాయి. రాష్ట్రంలో వెలుగులు నింపే పొత్తు ఇది. రాష్ట్ర పునర్ నిర్మాణం కోసం చేతులు కలిపారు. టీడీపీ-జనసేన కూటమి ఒకేసారి 118 సీట్లు ప్రకటించినప్పుడు కూడా వైకాపా నేతలకు మైండ్ బ్లాంక్ అయింది. నిన్న తాడేపల్లిగూడెం సభ చూసి తాడేపల్లి ప్యాలెస్ పిల్లికి, మంత్రులకు భయంతో జ్వరం వచ్చి ఇష్టానుసారంగా వాగుతున్నారు. టీడీపీ-జనసేన పొత్తును విచ్ఛిన్నం చేయడానికి రకరకాల కుట్రలకు పాల్పడుతున్నారు. ఎవరెంత దుష్ప్రచారం చేసినా, రెచ్చగొట్టినా వైకాపా విముక్త ఏపీ ఖాయం. టీడీపీ-జనసేన విన్నింగ్ టీమ్ అని ప్రజలకు అర్థమైంది. (Pilli Manikyala Rao)

వైకాపాది చీటింగ్ టీమ్ అని ఇప్పటికే గ్రహించారు. అట్టర్ ప్లాప్ సినిమాకు సీక్వెల్ ఉండదు. వైకాపా రెండో సారి అధికారంలోకి రాదు. పొత్తు గెలవాలి, రాష్ట్రం నిలవాలి, ప్రజల బతుకులు వెలగాలనే సంకల్పంతో టీడీపీ-జనసేన కూటమి జత కట్టాయి. ఇది చూసి వైకాపా నేతల కాలికింద భూమి కంపిస్తోంది. వారి రాజకీయ జీవితాలకు ముగింపు తప్పదు. టీడీపీ-జనసేన పొత్తులు, సభల గురించి ఇంతలా భయపడుతున్నారంటే ఓటమిని ఒప్పుకున్నారని అర్థమవుతోంది. విధ్వంస పాలనకు ముగింపు పలకాలనే చంద్రబాబు గారు, పవన్ కల్యాణ్ గారి పిలుపుతో తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదిలాయి. చంద్రబాబు గారు, పవన్ కల్యాణ్ గారి ప్రసంగాలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కేరింతలు, చప్పట్లతో తమ హర్షధ్వానాలు తెలియజేశారు. తెలుగువారి ఆత్మగౌరవం కాపాడేందుకే ఈ పొత్తు.

ఇది ప్రజలు కుదిర్చిన పొత్తు, జనం కోరుకున్న పొత్తు. తెలుగుజాతిని ప్రపంచంలోనే నెం.1 గా చేయడమే టీడీపీ-జనసేన ఉమ్మడి లక్ష్యం. సొంత చెల్లి, తల్లిని కూడా వదిలిపెట్టని జనగ్ రెడ్డికి ప్రజలు తగిన బుద్ధిచెప్పడం ఖాయం. చంద్రబాబు గారు సూటిన అడిగిన వై నాట్ జాబ్ కేలండర్, డీఎస్సీ, వైనాట్ ఉచిత ఇసుకకు ఎందుకు సమాధానం చెప్పడం లేదు. ముందు హూ కిల్డ్ బాబాయ్ కి సమాధానం చెప్పాలి. జగన్ రెడ్డిని తరిమికొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అగ్గితో టీడీపీ-జనసేన తమ్ముళ్లు వైసీపీని తగలబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. దీనికి వాయువు కూడా తోడైంది. ఆర్పడం మీ వల్ల కాదు. టీడీపీ-జనసేన ఐక్యత చెడగొట్టడానికి రకరకాల వేషాల్లో వైకాపా నేతలు వస్తారు. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి. టీడీపీ-జనసేన కొట్టే దెబ్బకు ఫ్యాన్ ముక్కలు ముక్కలు అయిపోతుందని “””” TDP రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు తెలిపారు.