Not before Me: అంటే ఏంటి.. ఇద్ద‌రు జ‌డ్జ్‌లు ఇలా ఎందుక‌న్నారు?

Chandrababu Naidu Case: అధినేత చంద్ర‌బాబు నాయుడు స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కేసులో భాగంగా రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో జ్యుడిషియ‌ల్ రిమాండ్‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. చంద్ర‌బాబు నాయుడు అనారోగ్య ప‌రిస్థితి దృష్ట్యా ఆయ‌నకు మ‌ధ్యంత‌ర బెయిల్ ఇవ్వాల‌ని కోరుతూ ఆయ‌న త‌ర‌ఫు లాయ‌ర్లు ఏపీ హైకోర్టులో బెయిల్ పిటిష‌న్ వేసారు. అయితే ఈ కేసును వాదించేందుకు జ‌స్టిస్ జ్యోతిర్మ‌యి నిరాక‌రించారు. నాట్ బిఫోర్ మి (not before me) అనేసారు. దాంతో చంద్ర‌బాబు బెయిల్ కేసు ఈ నెల 30కి వాయిదా ప‌డింది.

నాట్ బిఫోర్ మి అని ఎందుకు అంటారు?

చంద్ర‌బాబు నాయుడు కేసులో ఒక జ‌డ్జ్ నాట్ బిఫోర్ మి అన‌డం ఇది తొలిసారేం కాదు. కొన్ని రోజుల క్రితం సుప్రీంకోర్టు జ‌డ్జ్ కూడా ఇదే మాట అన్నారు. అస‌లు నాట్ బిఫోర్ మి అని ఎందుకుంటారంటే.. ఏదైనా కేసుకు సంబంధించి వాద‌న‌లు వినేందుకు కానీ.. తీర్పు చెప్పేందుకు కానీ ఆ జ‌డ్జ్‌కి సిద్ధంగా లేక‌పోతే నాట్ బిఫోర్ మి అంటారు. దీని అర్థం.. త‌ను కాకుండా వేరే జడ్జ్ ఈ కేసును టేక‌ప్ చేస్తారు అని.

ఎక్కువ‌గా ఈ మాట‌ను జ‌డ్జ్ ఎప్పుడు వాడ‌తారంటే.. ఆ కేసులో రాజ‌కీయ నాయ‌కులు కానీ రౌడీలు కానీ ఇత‌ర పేరుమోసిన వ్య‌క్తులు కానీ ఉంటే అప్పుడు ఈ మాట అంటారు. ఈ కేసుల‌ వ‌ల్ల వారి వ్య‌క్తిగ‌త‌, వృత్తిప‌ర‌మైన జీవితానికి ఏమైనా స‌మ‌స్య‌లు వ‌స్తాయేమో అని వారు నాట్ బిఫోర్ మి అనేస్తుంటారు.