Chandrababu కు ఎయిర్‌పోర్ట్‌లో ఎదురుప‌డిన డీకే.. ప‌క్క‌కు తీసుకెళ్లి మ‌రీ ఏం చెప్పారు?

Chandrababu: తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ఈరోజు బెంగ‌ళూరులో TDP ఫోరం స‌మావేశంలో పాల్గొన్నారు. ఆ త‌ర్వాత ఆయ‌న తిరిగి హైద‌రాబాద్ వ‌స్తున్న స‌మ‌యంలో బెంగ‌ళూరు ఎయిర్‌పోర్ట్‌లో క‌ర్ణాట‌క ఉప ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్ (dk shiva kumar) క‌లిసారు. చంద్ర‌బాబు ఆయ‌న్ను ప‌ల‌క‌రిస్తుండ‌గా సెక్యూరిటీని ప‌క్క‌కు నెట్టి చంద్ర‌బాబు చెయ్యి ప‌ట్టుకుని కాస్త దూరానికి తీసుకెళ్లి ఏదో ర‌హ‌స్యంగా మాట్లాడారు.

ఆ స‌మ‌యంలో తీసిన వీడియోలు వైర‌ల్‌గా మారాయి. అస‌లు ఆయ‌న‌తో అంత ర‌హస్యంగా చ‌ర్చించాల్సినది ఏముంటుంది అని అప్పుడే అపోజిష‌న్ పార్టీల‌కు టెన్ష‌న్ మొద‌లైపోయింది. ఇండియా కూట‌మిలో (india bloc) తెలుగు దేశం పార్టీని చేర్చుకునేందుకు చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ని కూడా తెలుస్తోంది. ఇప్ప‌టికే కాంగ్రెస్ ఏర్పాటుచేసిన ఇండియా కూట‌మిలో దాదాపు 28 రాజ‌కీయ పార్టీలు ఉన్నాయి. ఇందులోకి తెలుగు దేశం పార్టీని కూడా లాక్కుంటే కాంగ్రెస్‌కు ఏపీలో మంచి ప‌ట్టు ఉంటుంద‌ని ప్లాన్‌లో ఉన్నారు. కానీ జ‌న‌సేన (janasena) BJPతో పొత్తులో ఉండ‌గా BJPకి వ్య‌తిరేకంగా ఏర్ప‌డిన ఇండియా కూట‌మిలోకి చంద్ర‌బాబు క‌లవ‌ర‌ని చెప్ప‌చ్చు.