Karnataka CM ఎవరైతే ఏంటి? కాంగ్రెస్ నాన్చుడు ధోరణి ఎందుకో?
Bengaluru: కాంగ్రెస్ ఇప్పుడు సీఎం(karnataka cm) అభ్యర్థిని ఎంపిక చేయడంలో ఇబ్బంది పడుతోంది. ప్రస్తుతం రేసులో కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్(dk shivakumar), మాజీ సీఎం సిద్దారామయ్య(siddaramaiah) ఉన్నారు. వీరి ఇద్దరి మధ్య కొన్ని మనస్పర్థలు ఉన్నప్పటికీ.. ఇద్దరూ పార్టీ విజయం కోసం పనిచేశారు.
ఇక సీఎం కుర్చీపై ఇద్దరూ చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఒకానొక దశలో చెరో రెండున్నరేళ్లు సీఎం సీటును డీకే, సిద్దూ పంచుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ అందుకు డీకే శివకుమార్ సుముఖంగా లేరని సమాచారం… ఒక్కరినే ఫుల్‌టైం ఉండేలా నియమించాలని చెబుతున్నారు. మరోవైపు డీకే శివకుమార్‌పై ఐటీ, అక్రమాస్తుల కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకు సీఎం పదవి కట్టబెడితే.. బీజేపీ కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతుందని.. సిద్దారామయ్యకు సీఎం సీటు ఇవ్వాలని పలువుకు కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. అయితే.. డీకే శివకుమార్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు బీజేపీని అన్ని విధాలుగా ఎదుర్కొని పార్టీ గెలుపొందేందుకు ఎంతో కృషి చేశారు. ఒకవేళ ఈయనకు సీఎం పదవి ఇవ్వకపోతే.. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం పనిచేస్తారా లేదా అన్నది ప్రశ్నార్థకం.
సిద్దారామయ్య సీఎం కావాలని కర్నాటకలో 40 శాతం మంది ప్రజలు కోరుకుంటున్నట్లు పలు సర్వేల్లో వెల్లడైంది. దీంతోపాటు.. ఆయన సీఎంగా ఉన్న సమయంలో సంక్షేమ పథకాలను అమలుచేసి ప్రజల మన్నన పొందారు. అంతేకాకుండా.. ఓబీసీలో మూడో బలమైన సామాజికవర్గం అయిన కురబ కులానికి చెందిన వ్యక్తి. ఎన్నికల్లో సైతం అహిందా అనే నినాదంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను ఏకతాటిపైకి తెచ్చిన నాయకుడు సిద్దారామయ్య. మాస్లో కూడా మంచి ఫాలోయింగ్ ఆయనకు ఉంది. దీంతో.. సిద్దారామయ్యను సీఎంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే జరిగితే.. డిప్యూటీ సీఎం పదవితోపాటు పలు కీలక మంత్రిత్వ శాఖలను డీకేకు కట్టబెట్టనున్నారు. మరికొద్దిసేపట్లో ఆ విషయం కూడా స్పష్టం కానుంది