Telangana Elections: కాంగ్రెస్ తీసుకొచ్చిన ఈ కర్ణాటక మంత్రి ఎవరు?
Telangana Elections: సాధారణంగా ఎన్నికల సమయంలో ఏ పార్టీ అయినా స్థానిక నాయకులకే సీట్లు కేటాయించి పోటీ చేయిస్తుంది. ఇతర రాష్ట్రాలకు చెందిన నాయకులు వేరే రాష్ట్రంలో పోటీ చేయడం అనేది చాలా అరుదు. ఒకవేళ అలా పోటీ చేసినా కూడా వారు పుట్టిన ఊరు పెరిగిన ఊరు మాత్రమే వేరుగా ఉంటాయి. ఉదాహరణకు హైదరాబాద్‌లో పుట్టి పెరిగి ఏపీలో స్థిరపడినవారు హైదరాబాద్ నుంచి పోటీ చేసే అవకాశం ఉంటుంది. కానీ అసలు రాష్ట్రంలో ఎలాంటి సంబంధం లేకుండా పక్క రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేస్తానంటే కుదరదు.
ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే.. తెలంగాణ కాంగ్రెస్ (congress) ఇక్కడి ఎన్నికల ప్రక్రియను పరిశీలించాలని ఏకంగా కర్ణాటక (karnataka) రాష్ట్రానికి చెందిన నేతను బరిలోకి దింపింది. అతనెవరో కాదు.. ఎన్ఎస్ బోస్‌రాజు (ns boseraju). ఇతను కర్ణాటకలో ఇరిగేషన్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఇతను గతంలో AICC తరఫున తెలంగాణ యూనిట్‌కి ఐదున్నరేళ్లు ఇన్ఛార్జిగా వ్యవహరించారు. ఇతనిది కర్ణాటకలోని మాన్వి నియోజకవర్గం. కాకపోతే ఇతని స్వస్థలం ఏపీలోని భీమవరం కావడంతో తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫు స్పెషల్ అబ్సర్వర్గా నియమించారు. (telangana elections)
ఇందుకు కారణం స్పెషల అబ్సర్వర్గా ఎవర్ని ఉంచాలని కాంగ్రెస్ పార్టీలో అంతర్గత గొడవలు తలెత్తడమే. దాంతో పక్క రాష్ట్రం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిని తీసుకొస్తే ఏ సమస్యా ఉండదని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించుకుంది. ఈ ఏడాది కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో (karnataka elections) ఇతను పోటీ చేయనప్పటికీ సిద్ధారామయ్య కేబినెట్లో మంత్రిగా అవకాశం వచ్చినందుకు పార్టీలోని చాలా మంది అభ్యర్ధులు షాకయ్యారు.
తెలంగాణలో ఇతనికి పనేంటి?
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున అన్నీ దగ్గరుండి చూసుకునేందుకు బోస్రాజుని నియమించారు. తెలంగాణక కాంగ్రెస్ పార్టీ నేతలతో సమన్వయంగా ఉంటూ వారి కోసం ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటుచేసి పరిస్థితులను తెలుసుకుంటూ ఉంటారు. ఇప్పుడు కాంగ్రెస్‌లో అంతర్గత సమస్యలు కూడా ఉన్నాయి. వాటిని కూడా ఈయనే పరిష్కరించబోతున్నారు.
తెలంగాణలో మా పోటీ BRS పై మాత్రమే
తెలంగాణలో BJP తమ ప్రత్యర్ధి పార్టీ కానేకాదని.. తాము పోరాడబోయేది కేవలం BRS పార్టీతో మాత్రమేనని బోస్‌రాజు తెలిపారు. జరగబోయే ఎన్నికల్లో కచ్చితంగా BRS పార్టీని ఓడిస్తామని 70 నుంచి 72 సీట్ల వరకు గెలుస్తామన్న కాన్ఫిడెన్స్ ఉందని తెలిపారు. (telangana elections)