Vijaya Sai Reddy: ఎందుకు బాబు గారూ వాలంటీర్లంటే అంత పగ?
Vijaya Sai Reddy: తమ వాలంటీర్ల పట్ల ఎందుకు అంత పగ పెంచుకున్నారు? వారంటే ఎందుకంత కోపం అని తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును (Chandrababu Naidu) ప్రశ్నించారు విజయ సాయి రెడ్డి. తమ ప్రభుత్వం తరఫున 2.66 లక్షల వాలంటీర్లు నిర్విరామంగా పనిచేస్తున్నారని ఆంధ్రప్రదేశ్‌లోని కోట్ల మంది జనాభాకు అన్ని పథకాలు అందేలా చూస్తున్న వారి పట్ల ఎందుకు అంత కోపం అని అడిగారు. కోవిడ్ సమయంలో వాలంటీర్లు ఎంతో మంది ప్రాణాలు కాపాడారని.. అలాంటి వారి పట్ల ఇంత ద్వేషం ఏంటో తనకు అర్థం కావడంలేదని తెలిపారు.