PK ఓటు తొలగిస్తాడు అన్న చంద్రబాబు.. మళ్లీ PKని ఎందుకు కలిసారు?
Chandrababu Naidu: “” బీహార్ నుంచి వచ్చిన ఓ వ్యక్తి వైసీపీకి కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తున్నారు. 8 లక్షల టిడిపి ఓట్లను తొలగించారు. అందుకోసం ఫామ్-7 వినియోగించారు. చూస్తుంటే రేపు నా ఓటును కూడా తొలగిస్తారేమో!“” ఇది 2019 ఎన్నికల సమయంలో TDP అధినేత చంద్రబాబు నాయుడు చేసిన ట్వీట్. ఆ బిహార్ నుంచి వచ్చిన వ్యక్తి ఎవరో కాదు.. ప్రశాంత్ కిశోర్ (prashant kishore).
2019 ఎన్నికల సమయంలో ప్రశాంత్ కిశోర్ వ్యూహం వల్లే YSRCP అధికారంలోకి వచ్చింది. అలాంటిది ఇప్పుడు చంద్రబాబు 2024లో జరిగే ఎన్నికల్లో గెలవడానికి అదే ప్రశాంత్ కిశోర్ సాయం కోరారు. ఈ నేపథ్యంలో ఈరోజు నారా లోకేష్ (nara lokesh) ప్రశాంత్ కిశోర్ కలిసి ఒకే విమానంలో దిగారు. ప్రశాంత్ కిశోర్ చంద్రబాబు నివాసానికి వెళ్లి చర్చిస్తున్నారు. మరి ఆనాడు ఆయన YSRCP కోసం పనిచేస్తుంటే ఓటు తొలగిస్తారేమో అని కామెంట్ చేసి ఇప్పుడు అదే ప్రశాంత్ కిశోర్ సాయం కోరడంలోనే చంద్రబాబు బలహీనత క్లియర్‌గా కనిపిస్తోందని కామెంట్స్ వస్తున్నాయి.