YS Sharmila: నితీష్ ప్ర‌త్యేక హోదా అడిగారు.. మ‌రి మీరెప్పుడు అడుగుతారు బాబు గారూ?

why chandrababu naidu is not asking for special status for ap just like nitish kumar asks ys sharmila

YS Sharmila: NDA కూట‌మిలో భాగమైన JDU అధినేత నితీష్‌కుమార్ బిహార్‌కు ప్ర‌త్యేక హోదా కావాల‌ని డిమాండ్ చేసారు. అయితే.. ఇదే కూట‌మిలో కింగ్ మేక‌ర్‌గా ఉన్న తెలుగు దేశం పార్టీ అధినేత‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు అస‌లు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా కావాల‌న్న ఊసే ఎత్త‌లేద‌ని మండిప‌డ్డారు APCC చీఫ్ వైఎస్ ష‌ర్మిళ‌.

“” బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని నితీష్ తీర్మానం చేసి మోడీ ముందట డిమాండ్ పెడితే.. ఏపీకి హోదాపై చంద్రబాబు గారు కనీసం నోరు విప్పడం లేదు. మోడీ సర్కార్ లో కింగ్ మేకర్ గా ఉన్న మీరు.. హోదాపై ఎందుకు మౌనం వహిస్తున్నారో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. రాజధాని లేని రాష్ట్రంగా బీహార్ కంటే వెనకబడి ఉన్నామని మీకు తెలియదా ? 15 ఏళ్లు హోదా కావాలని అడిగిన రోజులు మీకు గుర్తులేదా ? రాష్ట్ర అభివృద్ధిలో ఏపీ 20 ఏళ్లు వెనకబడిందని చెప్పింది మీరే కదా ? హోదా ఇవ్వకుంటే మద్దతు ఉపసంహరణ అని ఎందుకు అడగడం లేదు ? మోసం చేసిన మోడీతో హోదాపై సంతకం ఎందుకు పెట్టించలేరు ? ప్రత్యేక హోదాపై మీ వైఖరి ఏంటో చెప్పాలని, రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రం దగ్గర హోదా డిమాండ్ పెట్టాలని, చంద్రబాబు గారిని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ప్రత్యేక ప్యాకేజీలు కాదు…రాష్ట్ర అభివృద్ధికి హోదా ఒక్కటే మార్గమని అని గుర్తు చేస్తున్నాం “” అని ష‌ర్మిళ ప్ర‌శ్నించారు.