Exclusive: 3 నెలలే అంటున్న చంద్రబాబు ప్లాన్ ఏంటి.. జగన్‌ను అలా ఎందుకు పోల్చారు?
Exclusive: తెలంగాణ ఎన్నికలు సమాప్తం అయ్యాయి. రెండు సార్లు KCR పాలన చూసిన ప్రజలు ఈసారి కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. దాంతో తెలంగాణలో KCR ఓడిపోయారు అంటే ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు (chandrababu naidu) వస్తారు అన్న టాక్ ఎక్కువైపోయింది. ఈ మాటను స్వయంగా చంద్రబాబు నాయుడే పరోక్షంగా అన్నారు. ఎంత పెద్ద నేత అయినా అహంకారం ఉంటే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని.. అహంకారం పెరిగితే ఏమవుతుందో తెలంగాణలో చూసామని.. 3 నెలల తర్వాత ఏపీలోనూ తెలంగాణ పరిస్థితే ఏర్పడుతుందని అన్నారు.
దీనర్ధం జగన్‌కు KCRలా అహంకారం పెరిగిపోయింది.. కాబట్టి తర్వాత వచ్చేది తమ ప్రభుత్వమే అని చంద్రబాబు చెప్పకనే చెప్పారు. దాంతో తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఏపీలో ప్రతిధ్వనిస్తున్నాయని క్లియర్‌గా అర్థమవుతోంది. చంద్రబాబు ప్రచార కార్యక్రమాలు సభలు ఏర్పాటు చేస్తున్నప్పుడు కూడా జగన్ పాలన ఎంత చెత్తగా ఉందో చెప్పడానికి BRS పార్టీని ఉదాహరణగా తీసుకుంటున్నారు. ఒక సీఎం ప్రజా దర్బార్‌ను నిర్వహించకుండా ప్రజలకు కనిపించకుండా పొగరుగా వ్యవహరిస్తే తెలంగాణలో ఏం జరిగిందో ప్రజలకు వివరిస్తున్నారు. ఇప్పుడు జగన్ కూడా ఇదే చేస్తున్నారని ఉదాహరణగా తీసుకుని తర్వాత వచ్చేది తమ ప్రభుత్వమే కాబట్టి ప్రజలు నిశ్చింతగా ఉండొచ్చని చెప్తున్నారు. (exclusive)
ఏపీ తీర్పు.. తెలంగాణలో మార్పు
తెలంగాణ ఎన్నికల్లో ముక్కోణపు యుద్ధం జరిగింది. అంటే బరిలో BRS, కాంగ్రెస్, BJP-జనసేన ఉన్నాయి. కానీ ఏపీలో మాత్రం కేవలం TDP-జనసేన, YSRCP పార్టీలు మాత్రమే ఉన్నాయి. ఓ రకంగా చెప్పాలంటే ఏపీలో భారతీయ జనతా పార్టీని లెక్కలో నుంచి తీసేసారు. చంద్రబాబు ఎక్కడ మాట్లాడినా కూడా జనసేనను కలుపుకుని మాట్లాడుతున్నారే తప్ప BJP గురించి ప్రస్తావించడంలేదు.
మరోపక్క పవన్ కూడా 2024లో వచ్చేది జనసేన-TDP ప్రభుత్వమే అంటున్నారు తప్ప ఎక్కడా కూడా BJP గురించి చెప్పడంలేదు. అంటే తెలంగాణలో BJPతో పొత్తు పెట్టుకుంటే డిపాజిట్లు కూడా రాలేదని పవన్‌కు కూడా అర్థమైపోయినట్లుంది. తెలంగాణలో జనసేన ఎందుకు గెలవలేదు అనే అంశంపై YSRCP నేత మార్గాని భరత్ స్పందించారు. పవన్ కళ్యాణ్‌కి తెలంగాణలో పవర్ లేకపోవడం వల్లే ఓడిపోయారని.. ఇక ఏపీలో కూడా అంతే అవుతుందని అంటున్నారు.
జనసేనకు పెరిగిన ఆదరణ
మరోపక్క పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేయడం వల్ల ఏపీలో అంతకుముందు కన్నా ఆదరణ పెరిగిందని తెలుస్తోంది. ఈ పాయింట్‌పై కూడా చంద్రబాబు ఫోకస్ చేస్తున్నారు. అందుకే జనసేనను కూడా ప్రస్తావిస్తూ ప్రసంగాలు సభలు నిర్వహిస్తున్నారు.
సెట్లర్ల సపోర్ట్ కాంగ్రెస్ (TDP)కే..!
మరోపక్క చంద్రబాబు నాయుడు తానే గెలుస్తానని ఇంత ధీమా వ్యక్తం చేయడానికి మరో కారణం.. తెలంగాణ ఎన్నికల్లో తెలంగాణలో ఉన్న ఏపీ సెట్లర్లు కాంగ్రెస్‌కే (పరోక్షంగా TDPకే) మొగ్గు చూపారని.. దానిని బట్టి చూస్తే ఏపీ వారు కూడా తనకే సపోర్ట్ చేయబోతున్నారని అనుకుంటున్నారు. అందుకే ఇంకో మూడు నెలలే అంటూ ప్రజలకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఏపీ మాజీ సీఎం.