YS Sharmila: కండువా కప్పుతుంటే నో చెప్పిన బ్రదర్ అనిల్!
YS Sharmila: YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేసేసారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో షర్మిళ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే షర్మిళ భర్త బ్రదర్ అనిల్ మాత్రం కండువా కప్పుకోవడానికి ఒప్పుకోలేదు. ఆయన స్టేజ్‌పైకి కూడా వెళ్లకపోవడం చర్చనీయాంశంగా మారింది. తాను కాంగ్రెస్‌లో తన పార్టీని విలీనం చేయడంపై తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా ఎంతో సంతోషిస్తారని ఈ సందర్భంగా వెల్లడించారు షర్మిళ. ఇక నుంచి YSRTP కాంగ్రెస్ ఒక్కటే అని అన్నారు. తనపై కాంగ్రెస్ ఏ బాధ్యత పెట్టినా తన కార్యకర్తలతో కలిసి నిబద్ధతతో పనిచేస్తానని షర్మిళ చెప్పారు.