Telangana Elections: పోటీ లేదన్న TDP .. ఎవరికి లాభం?
Telangana Elections: తెలుగు దేశం పార్టీ (TDP) అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు (chandrababu naidu) జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉండడంతో ప్రస్తుతం ఆ పార్టీ కాస్త డీలాపడిపోయింది. అందుకే తెలంగాణ ఎన్నికల్లో ఈసారి వారు పోటీ చేయడంలేదని ప్రకటించేసారు. మరో ఆరు నెలలో ఆంధ్రప్రదేశ్‌లో జరగబోయే ఎన్నికల్లో (ap elections) మాత్రమే పోటీ చేస్తామని తెలిపారు.
చంద్రబాబు నాయుడు పోటీ వద్దు అని కాసాని జ్ఞానేశ్వర్‌తో (kasani gnaneshwar) ములాఖాత్‌కు వెళ్లినప్పుడు చెప్పారట. ఇదే విషయాన్ని కాసాని పార్టీ శ్రేణులకు తెలిపారు. అయితే పార్టీ శ్రేణులు చంద్రబాబు నిర్ణయంతో సమ్మతించలేదు. TDP తెలంగాణలో పోటీ చేయాలని భావిస్తున్నారు. ఒకవేళ తెలుగు దేశం పార్టీ తెలంగాణ ఎన్నికల్లో కూడా పోటీ చేయాలని నిర్ణయించుకుని ఉంటే జనసేనకు (janasena) ప్రాబ్లం అయ్యేది. ఎందుకంటే తెలంగాణ ఎన్నికల్లో జనసేన BJP పార్టీతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగనుంది. ఆల్రెడీ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన TDP కలిసే వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి తెలుగు దేశం పార్టీ ప్రస్తుత పరిస్థితుల్లో పోటీ చేయకపోవడమే ఉత్తమమని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఎవరికి లాభం?
తెలుగు దేశం పార్టీ తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకపోతే ముందుగా లాభపడే పార్టీ కాంగ్రెస్ (congress). ఎందుకంటే తెలంగాణలో నివసిస్తున్న ఆంధ్ర ప్రజలు చంద్రబాబుని YSRCPతో కలిసి కేంద్ర ప్రభుత్వమే అరెస్ట్ చేయించి ఉంటుందని భావిస్తున్నారట. దాంతో వారి ఓట్లు BJPకి దక్కేలా లేవు. ఇక BRS విషయానికొస్తే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి (jagan mohan reddy) తెలంగాణ సీఎం KCRకి మధ్య మంచి అనుబంధమే ఉంది. దాంతో వారి ఓట్లు BRSకి కూడా పడే ఛాన్స్ లేదు. ఇక మిగిలింది కాంగ్రెస్.
అదీకాకుండా కాంగ్రెస్ అనగానే తెలుగు రాష్ట్రాల్లో ముందుగా గుర్తొచ్చే పేరు రేవంత్ రెడ్డి (revanth reddy). ఒకప్పుడు రేవంత్ రెడ్డి TDPలో ఉన్నవారే. సో హైదరాబాద్, ఖమ్మం, నల్గొండలోని ఓట్లు దాదాపు కాంగ్రెస్‌కే వెళ్లేలా సూచనలు కనిపిస్తున్నాయి.