Karnataka Next CM: సిద్ధారామయ్యా? డీకే శివకుమారా?
Bengaluru: మొత్తానికి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచేసింది. ఇక కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరు?(karnataka next cm) అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ నుంచి మాజీ సీఎం సిద్ధరామయ్య, కర్ణాటక-ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్‌ల పేర్లే వినిపిస్తున్నాయి. వీరిద్దరిలో ఎవర్ని సీఎంగా ప్రకటిస్తారు అనే ప్రశ్న మొదలైంది. కర్ణాటకలో సిద్ధరామయ్యకు మంచి మాస్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటివరకు వచ్చిన ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్‌లో సిద్ధరామయ్య సీఎం అయితే బాగుంటుంది అని తేలింది. కర్ణాటకలోని మైనారిటీల ఓట్లన్నీ సిద్ధరామయ్య వైపే ఉన్నాయి.
ఇక డీకే శివకుమార్ విషయానికొస్తే.. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్‌గా ఆయన ఎంతో కృషిచేసారు. ఎన్నో అరెస్ట్‌లు, రెయిడ్లు అయినప్పటికీ ఎంతో ధైర్యంగా వాటిని ఎదుర్కొంటూ ఎప్పటినుంచో పార్టీ కోసం నిజాయతీగా పనిచేసారు. రేపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో మీటింగ్ జరగనుంది. రేపు సీఎం అభ్యర్ధిని ప్రకటించనున్నారు. ఇద్దరూ సమానమైన ఫాలోయింగ్ కలవారే కాబట్టి.. కాంగ్రెస్ ఎవరిని ఎంచుకున్నా సమస్య ఏమీ ఉండదు. అయితే ఒకరిని సీఎం చేసినప్పుడు మరొకరు పాజిటివ్‌గా తీసుకుంటే అంతా బానే ఉంటుంది. నన్నెందుకు చేయలేదు అని అలిగితే మాత్రం.. ఐదేళ్ల టెన్యూర్‌లో రెండున్నర ఏళ్లు ఒకరు రెండున్నరేళ్లు ఇంకొకరు సీఎంగా బాధ్యతలు కల్పించే అవకాశం ఉంటుంది.