కూటమిలో చక్రం తిప్పుతున్న రాజ్యాంగేతర దొంగ
TDP: నాకేం కావాలో ఇవ్వండి.. మీకేం కావాలో తీసుకోండి అంటూ కూటమి ప్రభుత్వంలో రాజ్యాంగేతర శక్తి ఒకటి తచ్చాడుతోంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాకు బాగా తెలుసు.. వాళ్లు అన్నీ నాకే చెప్తారు అంటూ బురిడీ కొట్టిస్తూ దొరికినంత దోచేసుకుంటున్నాడట. ఆయన అధికారి కాదు.. ప్రజా ప్రతినిధి అంతకన్నా కాదు. గత చరిత్రలో ఎన్నో కేసులు. ఇప్పుడు ఆయనే రాష్ట్రంలో చక్రం తిప్పుతున్న పరిస్థితి. ఒకానొక దశలో పార్టీ తరఫున పోటీ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించిన వ్యక్తిగా చెప్తున్నారు. కూటమి సర్కార్‌లో చక్రం తిప్పుతున్నది ఇతనే అంటున్నారు. అతను కూడా అదే విధంగా ఎవరి వద్దకు వెళ్లినా కానీ తాను చక్రం తిప్పుతున్నాను మైనింగ్ కాంట్రాక్టులు, పోస్టింగుల్లో హవా తనదే అని కూడా చెప్పుకోవడం.. బిల్లులు క్లియర్ కావాలన్నా కమిషన్ కొడితే అంతా ఓకే చేస్తాను అని చెప్పి ప్రచారం చేసుకుంటున్నాడట.
ఇదంతా ఏంటి అని అనుకునేలోపు అసలు విషయం బయటపడింది. తాను లోకేష్‌కి చాలా దగ్గరి మనిషిని అని చెప్తూ ఎవరైతే తన వద్దకు వస్తారో వారందరికీ ఆధారాలు కూడా చూపించి తాను ఈ పని చేయగలను అని కూడా చెప్తున్న పరిస్థితి. మరో వైపు ఇదే విషయంపై ఇంతకు ముందు వెలుగుచూసింది. పవన్ కళ్యాణ్ తనకు బాగా తెలుసు దసరా వరకు అటవీ ప్రాంతాల్లో తవ్వకాలు చేయొద్దని గతంలో ఓ అధికారికి చెప్పడం జరిగింది. అప్పట్లో ఈ విషయం కాకినాడ జిల్లాలో హల్చల్ కావడంతో అక్కడి ఎంపీ ఆరా తీసి ఆ విషయాన్ని బయటపెట్టడంతో తరువాత పవన్ కళ్యాణ్ దీనిపై సీరియస్ అయ్యారు.
తాను పోటీ చేస్తానని చెప్పి టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించడంతో అప్పట్లో ఇతని చరిత్ర తెలిసినటువంటి పార్టీ నేతలు అతన్ని పక్కన పెట్టించిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇతను సీబీఐ అధికారులను కూడా మభ్య పెట్టే ప్రయత్నం గతంలో చేసినట్లుగా తేలడంతో ఈడీ అధికారులు ఇతన్ని పట్టుకునే ప్రయత్నం చేయడంతో అతను అరెస్ట్ అయ్యాడు. తాజాగా ఎన్నికల టికెట్ కోసం యత్నించి చివరకు పార్టీలు కూడా నీకో దండం అని వదిలించుకున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు కూటమి సర్కార్‌లో హల్చల్ చేస్తున్నానంటూ ప్రచారం చేసుకోవడంతో ఇతని విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే గనక సర్కార్‌కి చెడ్డ పేరు వస్తుందనే అభిప్రాయం ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఇతని గురించే చర్చ నడుస్తోందట.