Telangana Elections: దేశంలోనే బెస్ట్ ముఖ్య‌మంత్రి ఎవ‌రో తెలుసా?

Telangana Elections: ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డే స‌మ‌యంలో ఎవ‌రు ఉత్త‌మ రాజ‌కీయ‌నేత‌లు.. ఎవ‌రు రాష్ట్రానికి మంచి చేసారు అనే అంశాల గురించి తెలుసుకోవాల‌న్న ఆతృత ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మ‌నం ఎంచుకునే నేతే రేపు మ‌న భ‌విష్య‌త్తును తీర్చిదిద్దుతారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నిక‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో అస‌లు మ‌న భార‌త‌దేశంలోనే బెస్ట్ ముఖ్య‌మంత్రి ఎవ‌రో తెలుసుకుందాం.

ఇంత‌కీ మ‌న దేశంలో అత్యుత్త‌మ సీఎం ఎవ‌రో తెలుసా.. ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ (uttar pradesh) ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ (yogi adityanath). అవును.. యోగి దేశంలోనే అత్యుత్త‌మ సీఎం అట‌. ఈ విష‌యాన్ని న్యూయార్క్ టైమ్స్ సంస్థ వెల్ల‌డించింది. అంతేకాదు 2024లో ప్ర‌ధాన‌మంత్రి ప‌ద‌వికి కూడా ఆదిత్య‌నాథే స‌రైన వ్య‌క్తి అని న్యూయార్క్ టైమ్స్ సంస్థ నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అంతేకాదు 2020 ఆగ‌స్ట్ నాటికి ప్ర‌ముఖ ఆంగ్ల మీడియా సంస్థ నివేదిక‌లోనూ బాగా ప‌నిచేస్తున్న సీఎంగా యోగి ఆదిత్య‌నాథ్ పేరునే వెల్ల‌డించింది.