Telangana: సీఎం ప‌ద‌విపై ఎవ‌రేమంటున్నారు.. నెగ్గేదెవ‌రు.. త‌గ్గేదెవ‌రు?

Telangana: తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ గెలిచింద‌న్న మాటే కానీ ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ద‌గ్గ‌రికి వ‌చ్చే సరికి ప‌రిస్థితి గంద‌ర‌గోళంగా మారింది. యావ‌త్ తెలంగాణ‌కే స్టార్ క్యాంపెయిన‌ర్‌గా ఉన్న రేవంత్ రెడ్డి (revanth reddy) సీఎం అవ్వాల‌ని అంద‌రూ ఆకాంక్షిస్తున్నారు. ఆయ‌న‌కు మ‌ద్దతుగా దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి (uttam kumar reddy), మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క (mallu bhatti vikramarka) వంటి సీనియర్ నేత‌లు ఏమీ తీసిపోరు. వారికీ సీఎం అయ్యే అర్హ‌త ఉంది. కానీ ఎవ‌రికి సీఎం ప‌ద‌వి ఇస్తే ఎవరు నొచ్చుకుంటారో ఎక్క‌డ పార్టీ వీడ‌తారో అని కాంగ్రెస్ హైక‌మాండ్ ఈ విష‌యంలో ఆచి తూచి వ్య‌వ‌హ‌రిస్తోంది.

ప్ర‌స్తుతానికైతే సీఎం రేవంత్ అని ఆల్మోస్ట్ క‌న్ఫామ్ అయిపోయింది. మ‌రి క్యాబినెట్ మంత్రివ‌ర్గంలో ఎవ‌రు ఉండాలి అనేదానిపై చ‌ర్చ జ‌రుగుతున్న‌ట్లు తెలుస్తోంది. అయితే.. సీఎంగా రేవంత్‌ని నియ‌మించాల‌ని హైక‌మాండ్ చ‌ర్చిస్తున్న నేప‌థ్యంలో ఉత్త‌మ్ కుమార్ రెడ్డి త‌న మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టార‌ట‌. “” ఎన్నో సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను ఎంపీగా గెలిచాను, PCC అధ్యక్షుడిగా ఎక్కువ కాలం పని చేశాను, నేనెందుకు సీఎం అవ్వకూడదు “” అని అన్నార‌ట‌. మ‌రోప‌క్క ఉత్త‌మ్ ఎవ‌ర్ని సీఎం చేసినా త‌న‌కు బాధ‌లేద‌ని కూడా చెప్తున్నారు. ఇంకోప‌క్క‌ మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క కూడా ఇదే ప్ర‌శ్న వేసారు. తాను పాదయాత్ర చేసిన అన్ని చోట్లా కాంగ్రెస్ గెలిచిన‌ప్పుడు తాను ఎందుకు ముఖ్య‌మంత్రి కాకూడ‌దు అని అన్నార‌ట‌.

ప్ర‌స్తుతానికైతే మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీల ఆధ్వ‌ర్యంలో స‌మావేశం ముగిసిన‌ట్లు తెలుస్తోంది. ఎవ‌రు త‌గ్గారో ఎవ‌రు నెగ్గారో ఇంకాసేప‌ట్లో తెలిసిపోతుంది. ఒక‌వేళ సీఎం ప‌ద‌వి బ‌రిలో ఉన్న‌వారికి ఇవ్వ‌క‌పోతే బ‌హుశా వారికి పెద్ద బాధ్య‌త‌లు అప్ప‌గించే అవ‌కాశం కూడా ఉన్న‌ట్లు తెలుస్తోంది.