Bhanu Priya: KTRని ఎదిరించి.. క‌విత‌ను అరెస్ట్ చేసిన ఈ లేడీ డాన్ ఎవ‌రు?

Bhanu Priya: ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో (Delhi Liquor Scam) భాగంగా గ‌త శుక్ర‌వారం భార‌త రాష్ట్ర స‌మితి (BRS) ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌ను (Kalvakuntla Kavitha) ఢిల్లీకి చెందిన‌ ఈడీ అధికారులు అరెస్ట్ చేసారు. ప్ర‌స్తుతం ఈడీ ఆధ్వ‌ర్యంలో క‌విత 22 వ‌ర‌కు రిమాండ్‌లో ఉండ‌నున్నారు. అయితే క‌విత‌ను అరెస్ట్ చేస్తున్న స‌మ‌యంలో జాయింట్ డైరెక్ట‌ర్ భాను ప్రియ కూడా ఉన్నారు. ఈ మొత్తం ఆప‌రేష‌న్‌ను ద‌గ్గ‌రుండి న‌డిపించింది ఆమే. క‌విత అరెస్ట్‌తో ఆమె టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారారు.

KTRని ఎదిరించి మ‌రీ..

క‌విత ఇంట్లో ఈడీ సోదాలు జ‌రుగుతున్న స‌మ‌యంలో ఇంట్లో వారిని లోప‌లికి రానివ్వ‌ద్ద‌ని భాను ప్రియ బ‌య‌ట ఉన్న ఇత‌ర ఈడీ అధికారుల‌కు, సెక్యూరిటీ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసారు. అయినా కూడా భార‌త రాష్ట్ర స‌మితి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ KTR .. BRS ఎమ్మెల్యే హ‌రీష్ రావు (Harish Rao) లోప‌లికి వ‌చ్చారు. ఆ స‌మ‌యంలో భాను ప్రియ కేటీఆర్‌ను చూసి రెచ్చిపోయారు. అస‌లు లోప‌లికి ఎలా వ‌చ్చారు? ఎవ‌రు అనుమ‌తించారు అంటూ కేక‌లు వేసారు. (Bhanu Priya)

ఎవ‌రీ భానుప్రియ‌?

ఢిల్లీ ఈడీ బృందంలో భాను ప్రియ చాలా డైన‌మిక్ అని చెప్తుంటారు. భానుప్రియ స్వ‌స్థ‌లం రాజ‌స్థాన్. 2005లో సివిల్స్ క్రాక్ చేసారు. తండ్రి, అక్క కూడా సివిల్ స‌ర్వెంట్స్‌గా ఉన్నారు. చిన్న‌ప్ప‌టి నుంచి తండ్రి, అక్క‌ను చూస్తూ పెరిగిన భాను ప్రియ తాను కూడా సివిల్స్ రాసి నెగ్గారు. అయితే.. ఆమె క‌విత కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో మొద‌టి నుంచి ఉన్నారు. ఈ కేసులో ఇన్‌వాల్వ్ అయిన ప్ర‌తి ఒక్క‌రినీ జైలుకు పంపించ‌డంలో చాలా కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు.

ఢిల్లీ లిక్క‌ర్ కేసులో ఢిల్లీ ఉప ఉప‌ముఖ్య‌మంత్రి మ‌నీష్ సిసోడియాను జైలుకు పంపింది కూడా భానుప్రియే. భానుప్రియ ఏ రేంజ్‌లో కేసులోని కీల‌క ఆధారాలు స‌మ‌ర్పించారంటే.. మ‌నీష్ సిసోడియా (Manish Sisodia) అరెస్ట్ అయిన సంవ‌త్స‌రం వ‌ర‌కు ఆయ‌న‌కు బెయిల్ అనే మాటే లేదు. ఢిల్లీ లిక్క‌ర్ కేసులోని ప్ర‌తి ఒక్క‌రి చిట్టాను బ‌య‌టికి తీసి ఆధారాల‌తో స‌హా కోర్టులో స‌బ్మిట్ చేస్తూ నిందితుల‌ను జైలుకు పంపుతున్నారు భాను ప్రియ‌. అందుకే ఆమెను ఈడీ బృందంలోనే లేడీ డాన్ అని పిలుస్తుంటార‌ట‌.

అందుకే భానుప్రియ‌ను దించారు

క‌ల్వ‌కుంట్ల క‌విత విష‌యంలో ఈడీ అధికారులు స‌రిగ్గా వ్య‌వ‌హ‌రించ‌లేక‌పోయారు. క‌విత మాటిమాటికీ ఆడ‌వాళ్ల‌ను కార్యాల‌యానికి పిలిచి విచార‌ణ చేసే ప‌ద్ధ‌తి ఇది కాదు.. లోక్ స‌భ ఎన్నిక‌ల స‌మ‌యంలో విచార‌ణ‌కు రాలేను అంటూ ప‌లుమార్లు నోటీసులను దాటివేస్తూ వ‌చ్చారు. దాంతో కింది స్థాయి అధికారుల‌ను పంపితే ప‌ని అవ్వ‌ద‌ని తెలిసి నేరుగా భానుప్రియ‌ను దించారు. అలా క‌విత‌ను అరెస్ట్ చేసి ఆమె ప్ర‌త్యేక విమానంలో గ‌త శుక్ర‌వారం రాత్రి ఢిల్లీకి త‌ర‌లించారు. ఇప్పుడు క‌విత‌ను విచారణ చేస్తున్న నేప‌థ్యంలో భానుప్రియ వేసే ప్ర‌శ్న‌ల‌కు క‌విత గుట‌క‌లు మింగుతున్నార‌ని.. ఏమ‌డిగినా నాకు తెలీదు.. ఈ కేసులో నేను ఇన్‌వాల్వ్ అవ్వ‌లేదు అని చెప్తున్నార‌ట‌. మ‌రి 22 వ‌ర‌కు క‌విత రిమాండ్‌లో ఉంటారు కాబ‌ట్టి ఆ త‌ర్వాత ఏం జ‌రుగుతుందో వేచి చూడాలి.