Pawan Kalyan: కావాలనే విడాకుల ప్రచారం?
Hyderabad: పవన్ కళ్యాణ్ (pawan kalyan) తన భార్య ఆన్నా లెహ్నోవాతో (anna lezhnova) విడిపోయారంటూ రూమర్స్ వచ్చాయి. వాటన్నిటికీ సమాధానంగా నిన్న పవన్ తన భార్యతో కలిసి పూజలో పాల్గొన్న ఫొటోను జనసేన (janasena) రిలీజ్ చేసింది. పవన్ (pawan kalyan) విడాకుల గురించి చాలా వెబ్‌సైట్లు చాలా రాసాయి. కానీ ఫస్ట్ రాసింది మాత్రం అధికార YCPకి సపోర్ట్ చేసే వెబ్‌సైటేనని తెలుస్తోంది. పవన్ మూడో భార్యకు కూడా విడాకులు ఇచ్చేసారని ఆమెను దూరంగా ఉంచి నెల నెలా ఖర్చులకు డబ్బులు పంపుతున్నారని రాసారు. అది చూసి ఇతర తెలుగు, ఇంగ్లీష్ న్యూస్ వెబ్‌సైట్లు కూడా రాసేసాయి. వారందరి నోళ్లను ఒక్క ఫొటోతో మూయించేసారు జనసేనాని.
పవన్ వారాహి యాత్ర (varahi) చేస్తున్న సమయంలో అధికార పార్టీ గురించి ఎన్నో ఆరోపణలు చేసారు. అవినీతి గురించి డైరెక్ట్‌గానే ప్రశ్నించారు తప్ప వ్యక్తిగత దూషణలు మాత్రం చేయలేదు. కానీ అధికార పార్టీ మాత్రం ఏ మీటింగ్‌కి వెళ్లినా పవన్ మూడు వివాహాల గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. మొన్న ఏపీ సీఎం జగన్ (ap cm jagan) అమ్మ ఒడి సమావేశానికి హాజరై పవన్‌లా మూడు పెళ్లిళ్లు చేసుకోలేను అని మాట్లాడారు. దాంతో అమ్మ ఒడి లాంటి చిన్న పిల్లలకు సంబంధించిన కార్యక్రమంలో ఇలాంటి పెద్ద మాటలు ఎలా మాట్లాడతారని చాలా మంది తిట్టిపోసారు. ఇప్పుడు పవన్ (pawan kalyan) మూడో భార్యకు కూడా విడాకులు ఇచ్చేసారు అని ప్రచారం చేస్తే ప్రజల్లో నెగిటివిటీ వస్తుందన్న ప్లాన్‌తో ఈ తప్పుడు ప్రచారాలను మొదలుపెట్టినట్లు క్లియర్‌గా అర్థం అవుతోంది. అయినా పవన్ పెళ్లిళ్లకు ఆయన రాజకీయ ప్రయాణానికి సంబంధం ఏంటో ఇప్పటికీ అర్థంకావడంలేదు.