Telangana Elections: తెలంగాణ‌లో రిచెస్ట్ ఎమ్మెల్యేలు వీరే..!

Richest Mla’s in Telangana: తెలంగాణ ఎన్నిక‌లు (telangana elections) ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో మ‌న రాష్ట్రంలో అన్ని పార్టీల‌కు చెందిన రిచెస్ట్ ఎమ్మెల్యేలు ఎవ‌రో తెలుసుకుందాం. 2018లో తెలంగాణ ఎన్నిక‌లు జ‌రిగిన‌ప్పుడు 119 ఎమ్మెల్యేలలో 108 మంది కోటీశ్వ‌రులు అని తేలింది. ఈ డేటాను అసోసియేష‌న్ ఫ‌ర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ (ADR) వెల్ల‌డించింది. అంటే ఎన్నికైన ఎమ్మెల్యేల్లో 89% మంది కోటీశ్వ‌రులే.

పార్టీల వారీగా..!

తెలంగాణ‌కు చెందిన 88 మంది మందిలో 83 మంది రిచెస్ట్ ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరంతా భార‌త రాష్ట్ర స‌మితికి (BRS) చెందిన‌వారే. ఇక కాంగ్రెస్ విష‌యానికొస్తే 2018లో తెలంగాణ‌లో 19 మంది కాంగ్రెస్ (congress) ఎమ్మెల్యేలు గెలిచారు. వీరిలో 14 మంది కోటీశ్వ‌రులు. ఇక ఒవైసీకి చెందిన AIMIM పార్టీ నుంచి ఏడుగురు వ్య‌క్తులు తెలంగాణ‌లో ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వారిలో ఐదుగురు కోటీశ్వ‌రులు.

రిచెస్ట్ ఎమ్మెల్యే ఇత‌నే

2018 ఎన్నిక‌ల స‌మ‌యానికి యావ‌త్ తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ధ‌న‌వంతుడైన ఎమ్మెల్యే ఎవ‌రో కాదు.. సీనియర్ కాంగ్రెస్ నేత కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి (komatireddy rajagopal reddy). 2018 నాటికి ఈయ‌న ఆస్తుల విలువ రూ.318 కోట్లు. ఇక పేద ఎమ్మెల్యే విష‌యానికొస్తే.. యాకుత్‌పురాకు చెందిన AIMIM ఎమ్మెల్యే స‌య్య‌ద్ అహ్మ‌ద్ పాషా ఖాద్రి (Syed Ahmed Pasha Quadri) అత్యంత పేద ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయ‌న ఆస్తుల విలువ కేవ‌లం రూ.19 ల‌క్ష‌లు.

2018 ఎన్నిక‌ల స‌మ‌యానికి తెలంగాణ‌లో రిచెస్ట్ ఎమ్మెల్యేలు వీరే..!

కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి – రూ.314 కోట్లు

మ‌ర్రి జ‌నార్ధ‌న్ రెడ్డి – రూ.161 కోట్లు

కందాల ఉపేంద‌ర్ రెడ్డి – రూ.91 కోట్లు

పైళ్ల శేఖ‌ర్ రెడ్డి – రూ.91 కోట్లు

రాజేంద‌ర్ రెడ్డి – రూ. 66 కోట్లు

ఆరెక‌పూడి గాంధీ – రూ.61 కోట్లు

మ‌ల్లా రెడ్డి – రూ. 49 కోట్లు

ఈటెల రాజేంద‌ర్ – రూ.42 కోట్లు

ముత్తిరెడ్డి యాద‌గిరి రెడ్డి – రూ. 41 కోట్లు

కేటీఆర్ – రూ.41 కోట్లు

త‌క్కువ ఆస్తులు ఉన్న ఎమ్మెల్యేలు

సయ్య‌ద్‌ అహ్మ‌ద్ పాషా ఖాద్రి – రూ. 19 ల‌క్ష‌లు

రావి శంక‌ర్ సుంకె రూ. 20 ల‌క్ష‌లు

ఆత్రం స‌క్కు – రూ.27 లక్ష‌లు

మేక నాగేశ్వ‌ర‌రావు – రూ. 32 ల‌క్ష‌లు

కాలె యాద‌య్య – రూ.37 ల‌క్ష‌లు

రేగ కాంతారావు – రూ. 43 ల‌క్ష‌లు

అన‌సూయ ధ‌న్సారీ – రూ.50 లక్ష‌లు

కౌస‌ర్ మోయుద్దీన్ – రూ.58 ల‌క్ష‌లు

చిరుమ‌ర్తి లింగ‌య్య – రూ.67 ల‌క్ష‌లు

కోనేరు కోన‌ప్ప – రూ.75 ల‌క్ష‌లు