Jamili Elections: ప్రజలకు లాభమేంటి?
ఒకే దేశం ఒకే ఎన్నిక చట్టం (జమిలి ఎన్నికలు)లపై (jamili elections) ప్రతిపక్ష పార్టీల నేతలు మండిపడుతున్నారు. అసలు ఈ పద్ధతిలో ఎన్నికలు కండక్ట్ చేయడం వల్ల ప్రజలకు ఏమైనా లాభం ఉందా అని ప్రశ్నిస్తున్నారు. అసలు ఈ జిమిలి ఎన్నికలపై ఎవరు ఏమన్నారంటే..
అదే ప్లానా?
ఒకే దేశం ఒకే ఎన్నిక చట్టాన్ని తెచ్చి కేంద్రం DMK పార్టీని మాయం చేయగలదా అని ప్రశ్నించారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (mk stalin). దేశంలో రాష్ట్రపతి పాలనను తీసుకురావాలన్న ఉద్దేశంతోనే కేంద్రం ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లును (jamili elections) ప్రవేశపెట్టాలని ప్లాన్ చేస్తోందని ఆరోపించారు. ఒకే దేశం ఒకే ఎన్నికల చట్టాన్ని తీసుకొచ్చాక బీజేపీ ఒకే దేశం ఒకే రాష్ట్రపతి చట్టాన్ని కూడా ప్రవేశపెడుతుందని అన్నారు. అప్పుడు దేశం వన్ మ్యాన్ షోగా మారిపోతుందని ఆరోపించారు. ఈ చట్టం వస్తే DMK, AIADMK పార్టీలు నిలబడలేవని.. ఈ విషయం AIADMKకు తెలీక వారికి సపోర్ట్ చేస్తోందని అన్నారు. కేరళ, వెస్ట్ బెంగాల్, కర్ణాటకలలో ప్రభుత్వాలను తీసేసి రాష్ట్రపతి పాలన తెస్తే ఇక ఏ రాష్ట్రంలోనూ ఏ ప్రభుత్వం నిలవదని తెలిపారు. జమిలి ఎన్నికల కమిటీ కోసం BJP మాటలే వినేవారిని ప్యానెల్ సభ్యులుగా నియమించారని ఆరోపణలు చేసారు. ఇండియా కూటమి (india bloc) ఎక్కడ గెలిచేస్తుందో అని భయపడే గ్యాస్ సిలిండర్లపై రూ.200 తగ్గించారని ఆరోపించారు.
ప్రజలకు లాభమేంటి?
ఈ జమిలి ఎన్నికల (jamili elections) వల్ల ప్రజలకు లాభమేంటని ప్రశ్నించారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (arvind kejriwal). దేశానికి కావాల్సింది ఒకే దేశం ఒకే ఎన్నిక చట్టం కాదని.. ఒకే దేశం ఒకే విద్య, ఒకే దేశం ఒకే రకమైన ట్రీట్మెంట్ అని తెలిపారు. ప్రజలకు ఎన్నిసార్లు ఎన్నికలు జరుగుతున్నాయ్ అన్న విషయంతో పనిలేదని.. ఎన్నికల వల్ల తమకు ఎలాంటి లాభం చేకూరుతుందని మాత్రమే ఆలోచిస్తారని తెలిపారు. అదేదో ఒకే విద్య, ఒకే వైద్య చికిత్స లాంటి చట్టాలను తెస్తే ప్రజలు సంతోషిస్తారని అభిప్రాయపడ్డారు కేజ్రీవాల్.
నియంత పాలన
ఇక కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే (mallikarjun kharge) ఈ జమిలి ఎన్నికల (jamili elections) గురించి మాట్లాడుతూ.. ఇది నియంత పాలనకు దారి తీస్తుందని తెలిపారు. ఈ బిల్లు గురించి చర్చించేందుకు ఈనెల 5న ఇండయా కూటమికి చెందిన ఎంపీలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఇప్పటికే జమిలి ఎన్నికల కమిటీ సభ్యుల్లో ఒకరిగా నియమించిన కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి.. ఈ ప్యానెల్లో ఉండటం తనకు ఇష్టం లేదని చెప్పేసారు. ఈ విధానాన్ని అమలు చేయాలంటే రాజ్యాంగంలో ఐదు సవరణలతో పాటు మరెన్నో మార్పులు చేయాల్సి ఉంటుందని.. అనవసరంగా ప్రజాస్వామ్యం ఉన్న భారతదేశాన్ని నియంత పాలనలోకి తెచ్చేందుకు BJP ప్లాన్లు వేస్తోందని ఆరోపించారు.