EXCLUSIVE: YSRCP నుంచి తప్పుకోమని రాయుడుకి చెప్పింది ఎవరు?
EXCLUSIVE: మాజీ క్రికెటర్ అంబటి రాయుడు (ambati rayudu) ఇటీవల YSRCP పార్టీలో చేరి ఆ తర్వాత వారానికే రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. రాయుడు మొదటి నుంచి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికే (jagan mohan reddy) మద్దతు ఇస్తూ వచ్చారు. ఆయన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లోనూ జగన్‌కు సపోర్ట్ చేస్తున్న పోస్ట్‌లు మాత్రమే ఉన్నాయి. అంతేకాదు.. YSRCP పార్టీలో చేరినప్పుడు దిగిన ఫోటోలను కూడా ఆయన డిలీట్ చేయలేదు.
ఇంతలో ఏం జరిగింది?
YSRCP పార్టీలో చేరిన వారం రోజుల్లోనే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కొంతకాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నానని.. తనకు ఓ క్రికెట్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించే బాధ్యతలు అప్పగించారని చెప్పారు. ఆ తర్వాత రాయుడు జనసేనాని పవన్ కళ్యాణ్‌ను (pawan kalyan) కలవడంతో మ్యాటర్ అందరికీ అర్థమైపోయింది. రేపో మాపో ఆయన జనసేనలో (janasena) చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. పవన్‌ను కలిసాక తన ఆలోచనా విధానం పవన్ ఆలోచనా విధానం ఒకేలా ఉన్నాయని రాయుడు మీడియాతో చెప్పారు. అంతేకానీ జనసేనలో చేరుతున్నట్లు మాత్రం ఇంకా వెల్లడించలేదు.
సొంత నిర్ణయమేనా?
YSRCP పార్టీ నుంచి తప్పుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది కచ్చితంగా రాయుడు సొంత నిర్ణయం కాదని.. గుంటూరు ఎంపీ టికెట్ ఆశించినట్లుగానే జగన్ ఇవ్వడానికి ఒప్పుకున్నప్పుడు పార్టీ నుంచి తప్పుకోవాల్సిన అవసరం ఏముందన్న టాక్ వినిపిస్తోంది. కచ్చితంగా YSRCPకి చెందినవారే రేపు జరగబోయే ఎన్నికల్లో తెలుగు దేశం జనసేన గెలిచే అవకాశం ఉందని.. అనవసరంగా మునుగుతున్న పడవలో ఉండటం ఎందుకని రాయుడుని హెచ్చరించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అలా రాయుడు వెంటనే పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.