AP Elections: పొత్తులతో ఎవరికి లాభం.. ఎవరికి నష్టం?
AP: పొత్తులు పొత్తులు.. ఎక్కడ విన్నా ఇదే మాట. ఏపీ ఎన్నికలు (ap elections) ఈ పొత్తుల వల్లే ఈసారి రసవత్తరంగా మారనున్నాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన జనసేన (janasena) ఇప్పుడు ఎలాగైనా అధికారంలో ఉన్న YCPని ఓడించాలని పట్టుబట్టింది. ఇందుకోసం ఒంటరిగా పోటీ చేస్తే లాభం లేదని TDPతో పొత్తుకు సిద్ధమైంది. ఇక తన సాయం కోరి వచ్చిన జనసేనకు సపోర్ట్ చేయడానికి TDP సిద్ధంగా ఉన్నప్పటికీ.. BJPని కూడా కలుపుకుంటే ఇంకా స్ట్రాంగ్‌గా YCPని ఎదుర్కోవచ్చని TDP ప్లాన్ వేసినట్లుంది. అందుకే మొన్న TDP అధినేత చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డాలను కలిసారు. దాంతో ఇప్పుడు YCPకి ముచ్చెమటలు పడుతున్నాయి. ఎందుకంటే TDP, జనసేన, BJP కలిస్తే YCP గల్లంతైపోతుందని ఆ పార్టీకి కూడా తెలుసు. అందుకే ఏం చేసైనా సరే జనసేన TDP కలవకూడదని వైసీపీ వర్గాలు పవన్ కళ్యాణ్‌ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసాయి. అయినా జనసేన అవేం పట్టించుకోలేదు.
మరోపక్క NDAలో భాగం కావడానికి YCP కూడా ప్రణాళికలు రచిస్తోంది. దాంతో ఏ పార్టీని కలుపుకుపోతే ఏపీలో కమల జెండాను ఎగరవేయవచ్చా అని BJP కూడా తెగ ఆలోచించేస్తోంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఫెయిల్ అయిన బీజేపీ రానున్న తెలంగాణ, AP ఎన్నికలపై (ap elections) ఫోకస్ చేసింది. తెలంగాణలో ఉన్న ఏకైక BRS పార్టీని ఓడించాలంటే APలో గెలవాలి అనుకుంటున్నట్లు తెలుస్తోంది. విభజన తర్వాత రాష్ట్రాలు వేరైనప్పటికీ ప్రజలు మాత్రం తెలుగువారే కదా..! ఏపీలో తమ పార్టీ సత్తా చాటుకుంటే తెలంగాణ ప్రజలకు కూడా తమ సత్తా ఏంటో తెలిసొస్తుందని బీజేపీ అనుకుంటోంది. ఏదేమైనప్పటికీ ఈ పొత్తుల రాజకీయాల్లో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో కాలమే చెప్తుంది.