Telangana Elections: ఎగ్జిట్ పోల్స్ నిజమైన వేళ..!
Telangana Elections: తెలంగాణ ఎన్నికల ఫలితాలు రేపు వెలువడబోతున్నాయి. తెలంగాణలో అధికారం చేజిక్కుకునేది ఎవరో రేపటితో తేలిపోతుంది. అసలైన ఫలితాల కంటే ఎక్కువ ఉత్సహాన్నిచ్చే ఎగ్జిట్ పోల్స్ (exit polls) తెలంగాణలో వచ్చేది కాంగ్రెసే అని అంటున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అనేవి ఊహాజనకంగా చేసిన సర్వేల నుంచి వెలువడే ఫలితాలు మాత్రమే. వీటిని ప్రామాణికంగా తీసుకోకూడదు అని ఇప్పటికే పలు ఎగ్జిట్ పోల్ సర్వేలు చేసిన నిపుణులు చెప్తున్నారు. అయితే.. 2018 ఎన్నికల సమయంలో నిజమైన ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.
టైమ్స్ నౌ సర్వే ప్రకారం 2018లో BRS పార్టీకి మెజారిటీ సీట్లు వస్తాయని చెప్పింది. టైమ్స్ నౌతో పాటు జన్ కీ బాత్, రిపబ్లిక్ సి ఓటర్, ఇండియా టుడేకి చెందిన ఆక్సిస్ మై ఇండియా సర్వేలు కూడా కరెక్ట్‌గా BRS పార్టీదే అధికారం అని చెప్పాయి. ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలను నిజం చేస్తూ 2018లో BRS అధికారంలోకి వచ్చింది. అయితే ఇప్పుడు సేమ్ ఇవే సంస్థలకు చెందిన సర్వేలు ఈసారి మాత్రం కాంగ్రెస్ (congress) అధికారంలోకి వస్తుందని చెప్తున్నాయి. ముఖ్యంగా ఇండియా టుడేకి చెందిన యాక్సిస్ మై ఇండియా సంస్థ కాంగ్రెస్‌దే విజయం అని ఊదరగొట్టేస్తోంది.
మరి 2018లో ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యాయి కదా.. ఇప్పుడు కూడా అవుతాయి అని చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే తెలంగాణలో ఓటింగ్ శాతం పూర్తి కాకుండానే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు బయటికి వచ్చాయని మంత్రి KTR కూడా ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇంకా నాలుగు శాతం పోలింగ్ పూర్తి కావాల్సి ఉందనగా.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చేసాయి. దాంతో ఈ ఎగ్జిట్ పోల్స్‌ని ఎవ్వరూ పట్టించుకోవద్దని అసలు ఫలితాలు వచ్చే వరకు కంగారుపడొద్దని కూడా KCR పిలుపునిచ్చారు.