ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఉచిత బ‌స్సు ప్ర‌యాణం ఎప్ప‌టి నుంచి?

when will free bus service in andhra pradesh starts

Chandrababu Naidu: రేపు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌బోతున్నారు. గ‌న్న‌వ‌రంలో ఈ వేడుక జ‌ర‌గ‌బోతోంది. అయితే ఎన్నిక‌ల మేనిఫెస్టోలో ప్ర‌క‌టించిన‌ట్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప‌థ‌కంపై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. ఎప్ప‌టి నుంచి ఈ ప‌థ‌కం అమ‌ల్లోకి వ‌స్తుందా అని ఏపీ మ‌హిళ‌లు ఎదురుచూస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు నాయుడు ఆదేశాల మేర‌కు అధికారులు ఈ ప‌థకం అమ‌ల‌వుతున్న క‌ర్ణాట‌క‌, తెలంగాణ రాష్ట్రాల్లో ప‌ర్య‌టించారు. ఈ ప‌థ‌కం గురించి బాగా రీసెర్చ్ చేసి నివేదిక‌ను చంద్ర‌బాబుకు అందించారు. తెలంగాణ‌లో అమ‌లు అవుతున్న ప‌థ‌కం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు బాగా స‌రిపోతుంద‌ని వారు నివేదిక‌లో పేర్కొన్నారు. ప్ర‌మాణ స్వీకారం అనంత‌రం ముందుగా అమ‌లు చేసే ప‌థ‌కాల్లో ఉచిత బ‌స్సు ప్ర‌యాణ ప‌థ‌కం ఉండబోతోంద‌ని తెలుస్తోంది.