Pawan Kalyan: ప‌వ‌న్‌కు ముందే తెలుసా.. అందుకే ఆరోజు ష‌ర్మిళ గురించి అలా అన్నారా?

Pawan Kalyan: ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో వైఎస్ ష‌ర్మిళ (ys sharmila) హాట్ టాపిక్‌గా మారింది. అన్న వ‌దిలిన బాణం అన్న వైపే దూసుకెళ్లేలా ఉంది. క్రిస్మ‌స్ రోజున నారా లోకేష్‌కు (nara lokesh) కానుక పంపి మ‌రీ విష్ చేసిన ష‌ర్మిళ తెలుగు దేశం పార్టీ జ‌న‌సేన పార్టీల‌కు త‌న పూర్తి మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు చెప్ప‌క‌నే చెప్పారు.

అయితే ష‌ర్మిళ తెలుగు దేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నార‌ని జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ముందే స‌మాచారం ఉంద‌ట‌. అందుకే వారాహి యాత్ర చేస్తున్న స‌మ‌యంలో ష‌ర్మిళ గురించి ఆయ‌న ప్ర‌స్తావించారు. తెలంగాణ‌లో ష‌ర్మిళ పార్టీ పెట్టిన‌ట్లు తెలీగానే మంచిదే క‌దా.. రాష్ట్ర అభివృద్ధి కోసం విభిన్న అభిప్రాయాలు ఉన్న‌వారు పార్టీలు పెట్ట‌డంలో త‌ప్పు లేదు అనిపించింది అని ప‌వ‌న్ ఆరోజు అన్నారు. ఏనాడు కూడా ష‌ర్మిళ గురించి ఆయ‌న నెగిటివ్‌గా మాట్లాడింది కూడా లేదు.

జ‌గ‌న్ ష‌ర్మిళ‌ను దూరం పెట్టార‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. జ‌గ‌న్‌కు శ‌తృవులు ఎవరైనా ప్ర‌తిప‌క్షాల‌కు మిత్రులే. అందుకే ష‌ర్మిళ లోకేష్‌కు క్రిస్మ‌స్ కానుక పంపిన విష‌యం తెలిసి ప‌వ‌న్ పాజిటివ్‌గానే స్పందించిన‌ట్లు విశ్వ‌స‌నీయ వర్గాల స‌మాచారం.