Chandrababu Naidu: సిగ్గా.. భయమా.. గౌరవమా..?
Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు (AP Elections) ఇంకా రెండు నెలలే సమయం ఉంది. ఇంకో వారంలో కేంద్ర ఎన్నికల కమిషన్ (Election Commission Of India) నుంచి ప్రకటన కూడా వచ్చేస్తుంది. ఇంకా తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) అభ్యర్ధుల జాబితాను ప్రకటించకపోవడంపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
మరోపక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ఇప్పటికే అభ్యర్ధులకు సంబంధించి ఐదు జాబితాలు రిలీజ్ చేసేసారు. ఎవ్వరికీ భయపడకుండా తన వెంట ఉంటారా లేదా అనే సందేహం లేకుండా తన పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేసుకుంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు అలా చేయడం లేదు. ముందే అభ్యర్ధుల జాబితాను ప్రకటించేస్తే ఎక్కడ టికెట్ రాని వారు మెల్లిగా YSRCPలోకి జంప్ అయిపోతారా అనే భయంతో చంద్రబాబు నాయుడు జాబితాను రిలీజ్ చేయడంలేదనే టాక్ బలంగా వినిపిస్తోంది.
ఎన్నికలకు ఇంకో వారం ఉందనగా అభ్యర్ధులన ప్రకటిస్తానని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. మరి అంత లేట్‌గా అభ్యర్ధులను ప్రకటించేస్తే ప్రచారానికి ఇబ్బంది కాదా అంటే.. అభ్యర్ధులు సపరేట్‌గా వెళ్లి ఎన్నికల్లో ప్రచారం చేయాల్సిన అవసరం లేదని.. అభ్యర్ధులతో వారి నియోజకవర్గాల్లోనే శంఖారావం పేరుతో ఆల్రెడీ ప్రచారం మొదలుపెట్టేసామని అంటున్నారు. అంతేకాదు.. తాను పోటీ చేయాలనుకుంటున్న సీటును కూడా ఎన్నికలకు ముందే నిర్ణయిస్తానని అప్పటివరకు దీని గురించి ఎవ్వరితో చర్చించాలని అనుకోవడం లేదని స్పష్టం చేసారు. (Chandrababu Naiud)
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి KCR మాదిరి.. చంద్రబాబు నాయుడు కూడా రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకటి ఆయన నియోజకవర్గం అయిన కుప్పం. రెండోది ఎక్కడో ఆయన సస్పెన్స్‌లో ఉంచారు. ఆల్రెడీ తెలుగు దేశం పార్టీలోని చాలా మంది నేతలు ఎక్కడ టికెట్ రాదో అన్న ఆందోళనలో ఉన్నారు. విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నానిని (Kesineni Nani) తొలగించడంతో ఆయన ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మరుసటి రోజే YSRCPలో చేరిపోతున్నట్లు ప్రకటించారు. ఇలాంటి కేశినేని నానిలు చాలా మంది పార్టీలో ఉన్నారని చంద్రబాబు నాయుడుకి కూడా తెలుసు. అందుకే ముందే అభ్యర్ధులను ప్రకటించేయకుండా జాగ్రత్తపడుతున్నారు.
ఆల్రెడీ నూజివీడు నియోజకవర్గంలో రచ్చ జరుగుతోంది. స్థానిక నేత ముద్రబోయిన వెంకటేశ్వరరావు నూజివీడు టికెట్ తనకు కాకుండా వైసీపీ నుంచి తెలుగు దేశం పార్టీలోకి వచ్చిన పార్థసారథి అనే వ్యక్తికి ఇవ్వాలనుకుంటున్నట్లు తెలీడంతో ఆయన నానా హంగామా చేసారు.
మరోపక్క ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో (ap elections) ఎలాగైనా మళ్లీ గెలవాలని అధికార YCP.. ఏం చేసైనా సరే జగన్ మోహన్ రెడ్డిని గద్దె దించాలని తెలుగు దేశం (TDP), జనసేన (janasena) పార్టీలు తెగ ప్రయత్నిస్తున్నాయి. అయితే ఎలాగైనా జనసేన, తెలుగు దేశం పొత్తును చిత్తు చేసేందుకు ఎన్నో కుట్రలు పన్నుతోందని ఎప్పటినుంచో ఒక టాక్ నడుస్తోంది. ఇప్పుడు ఆ కుట్రలు ఎంత దాకా వెళ్లాయంటే.. చంద్రబాబు నాయుడిని (chandrababu naidu) పవన్ కళ్యాణ్‌ను (pawan kalyan) కలనివ్వకుండా ఏకంగా పార్టీ కోట్లు ఖర్చు పెడుతోందట. ఈ విషయం ముందే గ్రహించిన జనసేన, తెలుగు దేశం పార్టీ శ్రేణులు ఎప్పటికప్పుడు YCP ప్లాన్‌ను తిప్పికొడుతున్నాయి.