Posani: అంద‌రూ బ‌ట్ట‌లు విప్పి కొడ‌తా అంటారేంటి?

అందరూ బ‌ట్ట‌లు విప్పి కొడ‌తా అంటున్నారు.. బ‌ట్ట‌లు విప్పి ఏం చూస్తారురా నాయ‌నా అంటూ సెటైర్లు వేసారు పోసాని కృష్ణ‌ముర‌ళి (posani). నారా లోకేష్ (nara lokesh) పాదయాత్ర‌లో భాగంగా కొడాలి నానిని బ‌ట్టలు విప్పి న‌డిరోడ్డుపై నిల‌బెడ‌తా అన్నాడు. ఇలా అధికారంలోకి వ‌చ్చాక బ‌ట్ట‌లు ఊడ‌తీసి కొడ‌తాం అంటున్నార‌ని బ‌ట్టలు ఊడ‌తీయ‌కుండానే కొట్ట‌చ్చు క‌దా అంటూ చ‌మ‌త్క‌రించారు. ఏం చేయాలో జ‌నాల‌కు చెప్ప‌కుండా బ‌ట్ట‌లు విప్ప‌తీస్తా వాడికి అది తీస్తా ఇది తీస్తా అనడం ఏంటి అని పోసాని ప్ర‌శ్నించారు.

చంద్ర‌బాబు నాయుడు (chandrababu naidu) గురించి ప్ర‌స్తావిస్తూ.. ఆయ‌న ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన‌ప్పుడు కూడా సీఎం ప‌ద‌వి నాకెందుకు మీ ద‌గ్గ‌ర ప‌నోడిలా ఉంటాన‌ని అనేవాడ‌ని.. ఇన్నేళ్ల‌వుతున్నా ఇప్ప‌టికీ నాకు ముఖ్య‌మంత్రి ప‌ద‌విపై ఆసక్తి లేద‌ని అదే మాట అంటున్నాడ‌ని ఆయ‌న అస‌లు ఏమీ మార‌లేద‌ని విమర్శించారు. కాపుల‌కు ఓటు వేస్తే క‌మ్మ‌లు అన్యాయం అయిపోతార‌ని ఒక‌నాడు చెప్పిన చంద్ర‌బాబు.. ఇప్పుడు కాపుల‌పై ప్రేమ ఒల‌క‌పోస్తున్నాడ‌ని అన్నారు. (posani krishna murali)