EXCLUSIVE: జనసేన ఒంటరిగా వెళ్తుందా? అలాగైతే TDPకి ఎన్ని సీట్లు వస్తాయ్?
EXCLUSIVE: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో (ap elections) జగన్ మోహన్ రెడ్డిని (jagan mohan reddy) గద్దె దించేందుకు కంకణం కట్టుకున్నాయి జనసేన (janasena), తెలుగు దేశం పార్టీలు (TDP). అందుకే పొత్తు పెట్టుకున్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే పొత్తు సమయంలో జనసేనాని పవన్ కళ్యాణ్..(pawan kalyan) తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి (chandrababu naidu) ఓ షరతు పెట్టారు. ముందే నియోజకవర్గాలు, సీట్లు ప్రకటించేయొద్దు అని. కానీ చంద్రబాబు వినకుండా ఒక సీటు పేరు బయటపెట్టేసారు. అదే మండపేట. దాంతో పవన్‌కు ఒళ్లుమండింది. రూల్ ఉల్లంఘించినందుకు తన పార్టీ కూడా రెండు సీట్ల నుంచి పోటీ చేస్తుందని ప్రకటించేసారు. అవే రాజోలు, రాజా నగరం.
వద్దు అని చెప్తున్నా కూడా పొత్తు ధర్మం పాటించకుండా చంద్రబాబు ఒక సీటు పేరు రివీల్ చేయడంతో పవన్‌కు పీకల దాకా కోపం ఉంది. ముందే పోటీ చేయబోయే సీట్ల పేరు చెప్పేస్తే జగన్ అలెర్ట్ అవుతారని పవన్ పలుమార్లు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా కూడా మాది ప్రధాన ప్రతిపక్షం.. మధ్యలో వచ్చిన జనసేన చెప్తే మేం వినాలా అనే యాటిట్యూడ్‌తో తెలుగు దేశం పార్టీ వ్యవహరిస్తున్నట్లు క్లియర్‌గా తెలుస్తోంది. కాకపోతే ఇప్పుడు చంద్రబాబుని విమర్శించలేని పరిస్థితి. కానీ పవన్‌కు తిక్క రేగితే ఆయన ఏదైతే అది అవుతుంది అనే ధోరణితో ఆలోచించి ఒంటరిగా బరిలోకి దిగే అవకాశం లేకపోలేదని సన్నిహిత వర్గాల సమాచారం. అదే జరిగితే తెలుగు దేశం పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది? జనసేన ఎన్ని సీట్లు గెలుస్తుంది? అనే చర్చ కూడా మొదలైపోయింది.
కొందరేమో తెలుగు దేశం పార్టీకి 40 సీట్లు కూడా రావు అంటున్నారు. మరికొందరు గెలిపించే ఆ 5% to 10% ఓట్లు జనసేన పార్టీవేనని మినిమం 50% నుంచి 60% నియోజకవర్గాల్లో తెలుగు దేశం పార్టీ ఓడిపోయే అవకాశం ఉందని మరికొందరి వాదన. మరోపక్క జనసేనకు కూడా నష్టం కలిగే అవకాశం లేకపోలేదు. కాకపోతే ఇలా పొత్తు అని చెప్పి షరతులు ఉల్లంఘిస్తే ఎవరు మాత్రం సహిస్తారు? అసలే పవన్‌కు ఆత్మాభిమానం ఎక్కువ. ఆయన ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో ఆయనకే తెలీదు. ఇలాంటి సమయంలో తెలుగు దేశం కేడర్ కూడా కాస్త సహనంతో ఆచి తూచి నిర్ణయాలు తీసుకుంటే మంచిది.