Bharat: పేరు మార్పు.. పైసా లాభం లేదు..!
ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ఇండియాను (india) భారత్‌గా (bharat) మార్చాలన్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు కేంద్రం తీసుకున్న నిర్ణయాలు ఓ లెక్క అయితే ఇప్పుడు ఇండియాను భారత్ అని మార్చాలన్న నిర్ణయం మరో ఎత్తు. అసలు ఇండియాను భారత్‌గా మార్చినా మార్చకపోయినా ఎవ్వరికీ పైసా ఉపయోగం లేదు. కాకపోతే నష్టాలు మాత్రం బాగానే ఉన్నాయి.
ఇప్పుడు మన ఇండియాలో చాలా అధికారిక వెబ్‌సైట్లకు .IN అనే డొమైన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇండియాను భారత్‌గా మారిస్తే ఆ వెబ్‌సైట్లకు లేనిపోని సెక్యూరిటీ సమస్యలు వస్తాయి. అసలైతే ఇంగ్లీష్‌లో మన దేశాన్ని ఇండియా అని తెలుగులో భారత్ అని అంటాం. ఒకవేళ కేవలం భారత్ అని మార్చాల్సి వస్తే మాత్రం ఇంగ్లీష్, హిందీలో భారత్ అనే పిలవాలి. అంతేకాదు.. ఇండియాకి చెందినవారిని విదేశాల్లో ఇండియన్స్ అని సంబోధిస్తారు. ఇప్పుడు పేరు మార్చడం వల్ల భారతీయన్లు అని పిలుస్తారా? అనే సందేహాలు కూడా ఉన్నాయి. (bharat)
ఒకవేళ .IN వెబ్‌సైట్లకు భారత్ అని వచ్చేలా .BH అని పెట్టాలనుకుంటే మాత్రం అస్సలు కుదరదు. ఎందుకంటే అది బహ్రైన్ (bahrain) దేశానికి సంబంధించిన TLD (టాప్ లెవెల్ డొమైన్). అలాంటప్పుడు .IN వెబ్‌సైట్లను బ్యాన్ చేస్తారా? ఒకవేళ చేయకపోతే అది ఫేక్ వెబ్‌సైట్ అనుకుని ప్రమాదం కూడా లేకపోలేదు. .IN అనేది మనకు CCTLD. అంటే కంట్రీ కోడ్ టాప్ లేయర్ డొమైన్. ఏ వెబ్‌సైట్‌కి అయినా ఈ డొమైన్ ఉందంటే.. అది ఇండియాకు చెందిన అధికారిక వెబ్‌సైట్ అని అర్థం. దీనికి సబ్ డొమైన్స్ కూడా ఉన్నాయి. అంటే gov.in (గవర్నమెంట్ ఆధారిత వెబ్‌సైట్), mil.in (మిలిటరీ ఆధారిత వెబ్‌సైట్). (bharat)
మరి ఇప్పుడు భారత్ అని మార్చాక ఏ డొమైన్ వాడతారు? BH, BR, BT అని వాడలేరు. ఎందుకంటే అవి ఆల్రెడీ వేరే దేశాల్లో వాడుకలో ఉన్నాయి. మాకు ఒక డొమైన్ ఇస్తారా అని కూడా అడుక్కోలేం కాబట్టి .BHARAT . అని కానీ .BHRT అని కానీ పెట్టుకోవాలి.
ఇవన్నీ పక్కనపెడితే.. ఏ కేంద్రం అయితే ఇండియా తీసేసి భారత్ అని పెట్టాలని చూస్తోందో.. గతంలో వారు తీసుకొచ్చిన కొన్ని అభివృద్ధి కార్యక్రమాల పేర్లు ఇవి
స్కిల్ ఇండియా
మేకిన్ ఇండియా
స్టార్టప్ ఇండియా
స్టాండప్ ఇండియా
డిజిటల్ ఇండియా
ఫిట్ ఇండియా
ఇవన్నీ కేంద్రం తీసుకొచ్చిన కార్యక్రమాలే. మరి వీటికి ఇండియా అని పేరు పెట్టినప్పుడు వారి బుద్ధి ఏమైందో..! అన్నీ ఎన్నికల ముందే గుర్తొస్తాయి కాబోలు..! అంతేకాదు.. పాస్‌పోర్ట్స్, ఆధార్ కార్డులు, ప్యాన్ కార్డులు, డ్రైవింగ్స్ లైసెన్సులు.. చివరికి కరెన్సీ నోట్లపై ఉన్న ఇండియాను కూడా భారత్ అని మార్చాలంటే తల ప్రాణం తోకలోకి వస్తుంది. దాని వల్ల లక్షల కోట్లు వృథా అవ్వడం.. ప్రజల సమయం వేస్ట్ అవ్వడం తప్ప పైసా ఉపయోగం ఉందా? అనేది కేంద్రం నిర్ణయించుకోవాలి. (bharat)