Sitaram Yechury: AIIMSకి దానంగా భౌతికకాయం.. ఏం చేస్తారో తెలుసా?
Sitaram Yechury: CPI (M) జనరల్ సెక్రటరీ సీతారాం యేచూరీ రెండు రోజుల క్రితం చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఆయన భౌతికకాయానికి ఎలాంటి అంత్యక్రియలు నిర్వహించడంలేదు. బాడీని ఎయిమ్స్ హాస్పిటల్‌కు పరిశోధనల కోసం ఇచ్చేసినట్లు ఆయన కుటుంబీకులు తెలిపారు. ఎయిమ్స్ వైద్యులు ఆయన మృతదేహంతో ఏం చేస్తారో తెలుసా?
ముందు ఆయన మృతదేహాన్ని హాస్పిటల్‌లోని అనాటమీ డిపార్ట్‌మెంట్‌కు తరలిస్తారు. అక్కడ బాడీ కుళ్లిపోకుండా ఉండేందుకు ఎంబామింగ్ చేసి ఇన్‌జెక్షన్లు వేస్తారు.
మెడికల్ స్టూడెంట్స్ మానవ శరీరంలోని అవయవాల గురించి తెలుసుకునేందుకు సీతారాం బాడీని పరిశీలిస్తారు. అదే బాడీపై సర్జరీలు ఎలా చేయాలో తెలుసుకుంటారు.
విద్యార్ధులు తమ ట్రైనింగ్‌లో భాగంగా అన్నీ నేర్చుకున్నాక ఆ బాడీని డిస్పోజ్ చేసేస్తారు. ఆయన ఎముకలను మాత్రం ఇతర పరిశోధనల కోసం భద్రపరుస్తారు. మిగతా శరీరాన్ని మెషీన్‌లో వేసి కాల్చేస్తారు.